పల్నాడు, చిలకలూరిపేట: జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విడదల రజిని ఆధ్వర్యంలో.
ఆదివారం మధ్యాహ్నం దివంగత నేత రాజశేఖర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన మంత్రి రజిని.ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూత్ ఐకాన్ విడదల గోపి.
తదుపరి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ని కట్ చేసిన మంత్రి విడదల రజిని.ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు,మండల నాయకులు, కౌన్సిలర్లు,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని విలేకరులతో మాట్లాడుతూ.చంద్రబాబు నాయుడు టైంలో ప్రజలకు చేసింది ఏమీ లేదు అని దుయ్యబట్టిన మంత్రి రజిని.మా పార్టీ 1,80,000 కోట్లను సంక్షేమానికి ఉపయోగిస్తున్నామని చెప్పిన మంత్రి విడదల రజిని.గత ప్రభుత్వంలో లేని విధంగా మా ప్రభుత్వంలో విద్య వైద్యం ఉచితంగా అందిస్తున్నామని తెలిపిన మంత్రి.
సంక్షేమ పథకాలలో భాగంగా అమ్మ ఒడి నగదును నేరుగా తల్లుల ఖాతాలలో వేస్తున్నామని తెలిపిన మంత్రి రజిని.
ప్రజాసంకల్పయాత్ర ద్వారా ఎండనక వాననక తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకున్న నాయకుడు మా జగనన్న అని అన్న రజిని.
ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకొని దానిని మేనిఫెస్టో గా రూపొందించి, మేనిఫెస్టో లో ఉన్న నవరత్నాలను ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వం మాది అని తెలిపిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కౌన్సిలర్లు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది.