Venky kudumula nithin : మళ్ళీ రాబోతున్న భీష్మ కాంబో.. ఈసారి కూడా హిట్ అందుకుంటుందా?

వెంకీ కుడుముల.ఈయన చేసింది కొన్ని సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.వెంకీ కుడుములకు ఇది మొదటి సినిమా.అంతేకాదు ఈ సినిమాతోనే రష్మిక మందన్న తెలుగు తెరకు పరిచయమైంది.ఈ సినిమా వల్ల వెంకీ కుడుముల టాలీవుడ్ లో మంచి డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Bheeshma Combo To Repeat Again, Venky Kudumula, Nithin, Beeshma, Chiranjeevi, Bh-TeluguStop.com

ఇక ఆ తర్వాత భీష్మ సినిమా చేసాడు.ఈ సినిమాలో కూడా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.ఇది కూడా సూపర్ హిట్ అయ్యింది.ఈ సినిమా అటు నితిన్ కెరీర్ కు ఇటు వెంకీ కెరీర్ కు ప్లస్ అయ్యింది.

అయితే ఈ సినిమా తర్వాత వెంకీ కుడుముల ఇంత వరకు మరొక సినిమాను మొదలు పెట్టలేదు.ఇప్పటికే చాలా మంది హీరోలు పేర్లు వినిపించిన ఒక్కరితో కూడా సినిమా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించలేదు.

ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవితో వెంకీ సినిమా చేయబోతున్నాడు అని టాక్ అయితే వచ్చింది.కానీ ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు.

ఇక తాజా ఈయన లైనప్ గురించి మరొక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

Telugu Beeshma, Bheeshma Combo, Bheeshmacombo, Chiranjeevi, Nithin, Venky Kudumu

వెంకీ కుడుముల మరోసారి నితిన్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ చేసారని.ఆ కథ నితిన్ కు కూడా బాగా నచ్చిందని.

అంత కుదిరితే త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించ బోతున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.అలాగే మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించ బోతున్నారని టాక్.

చూడాలి మరి ఈ కాంబోలో మరో సినిమా ఉంటుందో లేదో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube