ఎక్కువగా ఎండగా ఉన్న సమయంలో పనిచేసి నీరసంగా ఉన్నప్పుడు నిమ్మకాయ రసం చేసుకుని తాగితే ఎంతో కొంత నీరసం తగ్గిపోతుంది.నిమ్మకాయ రసంలో నీరు, తేనెను కలిపి తాగడం వల్ల శరీర ఆరోగ్యానికి ఎన్నో పోషకాలు అందుతాయి.
చాలామంది ప్రజలు ఉదయం లేవగానే గోరు వెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగుతూ ఉంటారు.ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీళ్లలో కలుపుకుని తాగడం వల్ల శరీరంలోని చెడు వ్యర్ధాలు బయటకు వెళ్తాయి.
అధిక బరువు సమస్య తగ్గడానికి కూడా లెమన్ టీ బాగా ఉపయోగపడుతుంది.
లెమన్ టీ ప్రతి రోజు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ సమస్యలు కూడా తగ్గిపోతాయి.
ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది.లెమన్ టీ లోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కాలుష్య కారకాలను తగ్గించడంలో ఉపయోగపడతాయి.
విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల శరీర కణజాల పెరుగుదల కు ఇది బాగా ఉపయోగపడుతుంది.ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
లెమన్ టీ గుండె జబ్బుల ప్రమాదాన్నే కాకుండా, అధిక రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది.
లెమన్ టీ తాగడం వల్ల అధిక దాహం తీరడమే కాకుండా బరువు కూడా తగ్గిపోతారు.
లెమన్ టీ తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కూడా తగ్గిపోతుంది.రుతుక్రమం ఆగిన మహిళల్లో ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.ఇంకా చెప్పాలంటే లెమన్ టీ లో అల్లాన్ని వేసి తాగడం వల్ల కడుపునొప్పి, వికారం వంటి సమస్యలు తగ్గిపోతాయి.ప్రతిరోజు లెమన్ టీ తాగడం వల్ల వల్ల ఆకలిని కూడా తగ్గిస్తుంది.
ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ వేగవంతమవుతుంది.లెమన్ టీ లో చక్కెర వేయకుండా తాగితే చాలా తక్కువ కేలరీలు ఉంటాయి.
ఇది కూడా బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది.