అల్లు శిరీష్ చాలా గ్యాప్ తర్వాత తీసిన సినిమా ఊర్వశివో రాక్షసివో. రాకేష్ శశి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటించింది.
రొమాంటిక్ ఎంటర్టైన్ గా వచ్చిన ఈ సినిమా నేడు రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.రొమాంటిక్ పాళ్లు కొద్దిగా ఎక్కువైనట్టు అనిపించినా సినిమా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిందని అంటున్నారు.
మొత్తానికి అల్లు శిరీష్ కి ఈ సినిమా హిట్ ఖాతా తెరచిందని చెబుతున్నారు.
అల్లు శిరీష్ వరుస ప్రయత్నాలైతే చేస్తున్నాడు కానీ సరైన సక్సెస్ రావట్లేదు.
కానీ ఈసారి ఆల్రెడీ హిట్టైన సినిమతో వచ్చి ఇక్కడ మంచి ఫలితాన్ని అందుకున్నాడు.సినిమాకు ఎలాగు పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి వసూళ్లు కూడా బాగానే ఉండొచ్చని చెప్పొచ్చు.
మరి అల్లు శిరీష్ ఇలానే కంటెంట్ ఉన్న సినిమాలతో వస్తే తప్పకుండా అతను కూడా మెగా హీరోల సరసన నిలిచే ఛాన్స్ ఉంటుంది.

అల్లు శిరీష్, అనుల రొమాన్స్ తోనే సినిమాకు సగం మార్కులు కొట్టేశారని చెబుతున్నారు.సినిమాలో వీరిద్దరి జోడీకి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. సినిమా కి వచ్చిన టాక్ ఎంతమేరకు వసూళ్ల మీద ప్రభావితం చేస్తుందో చూడాలి.







