హైదరాబాద్ బంజారాహిల్స్ లోని డీఏవీ స్కూల్ లో నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది.తాజాగా ఈ కేసుపై స్పందించిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన తెలిపారు.నిందితుడికి శిక్ష విధించే క్రమంలో అన్ని ఆధారాలను పరిగణనలోకి తీసుకోవాలన్న ఎంపీ.
అలాంటి వారికి ఉరి శిక్షే సరైనదని చెప్పారు.ఏపీలో శాంతి భద్రతలను కాపాడేందుకు సీఎం జగన్ కఠినంగా వ్యవహారిస్తున్నారని ఆయన వ్యాఖ్యనించారు.