టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
కాగా ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ లాంటి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.అలాగే ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
హీరో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి, ప్రభాస్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.పాన్ ఇండియా లెవెల్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా హీరో ప్రభాస్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
తెలుగు ఇండస్ట్రీ తో పాటు ఇతర ఇండస్ట్రీలలో కూడా ఎంతోమంది ప్రేక్షకులు ప్రభాస్ ని ఇష్టపడుతుంటారు.ఇక డార్లింగ్ ఫాన్స్ గురించి మనందరికీ తెలిసిందే.
ప్రభాస్ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటారు అభిమానులు.ప్రభాస్ కూడా తన అభిమానులకు ఏదైనా ఆపద వచ్చింది అంటే చాలు సహాయం చేస్తూ ఉంటాడు.
ఇటీవలే తన పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు మరణించిన రోజు లోపల బోలెడు దుఃఖంతో బాధపడుతూ అభిమానులను భోంచేసి వెళ్ళమని చెప్పడం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.దాంతో ప్రభాస్ వి అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు.
డార్లింగ్ ప్రభాస్ కోసం అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉంటారు.
ప్రభాస్ పుట్టినరోజు నాడు రక్తదానాలు అన్నదానం ఇలా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ప్రభాస్ అభిమానులు.తాజాగా ఒక అభిమాని ప్రభాస్ పై తనకున్న అభిమానాన్ని ఒక ఫోటో ద్వారా చూపించారు.ఆ అభిమాని ప్రభాస్ కోసం తన రక్తాన్ని దానం చేస్తూ ఆ రక్తంతో ప్రభాస్ బొమ్మలు ఏందో చక్కగా గీశాడు.
అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.రక్తంతో ప్రభాస్ బొమ్మను ఎంతో చక్కగా వేశారు.ఆ ఫోటోలు వీడియోలను చూసిన ప్రభాస్ అభిమానులు అది కదా ప్రభాస్ అభిమానులు అంటూ అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఆ ఫోటోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.ఇది ప్రభాస్ పుట్టిన రోజుకు ముందే ఈ రేంజ్ లో హంగామా చేస్తుంటే ఇక పుట్టినరోజు నాడు ఏ రేంజ్ లో సందడి చేస్తారో చూడాలి మరి.