మునుగోడ్ ఉప ఎన్నికలలో TRS అభ్యర్ధి గెలుపు ఖాయం - మంత్రి తలసాని

మునుగోడ్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో TRS అభ్యర్ధి గెలుపు ఖాయం అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్తం చేశారు.గురువారం సనత్ నగర్ లో 3.87 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు.

 మునుగోడ్ ఉప ఎన్నికలలో Trs అభ్యర-TeluguStop.com

ఎన్నో సంవత్సరాల నుండి ప్లోరిన్ భారిన పడి అనేకమంది అంగవికలురుగా మారారని, అనారోగ్యంతో భాధపడేవారని, మిషన్ భగీరధ కార్యక్రమంతో సురక్షితమైన త్రాగునీటిని ఇంటింటికి సరఫరా చేయడం వలన ప్లోరిన్ సమస్యకు శాశ్వత పరిష్కరించడం జరిగిందని అనారు.50 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్లోరిన్ సమస్యను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు.హుజూరాబాద్, దుబ్బాక నియోజకవర్గాలలో గెలిచిన BJP MLA లు కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్ని నిధులు తీసుకోచ్చారో, ఎంత అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

రాజగోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తి స్వార్ధం వలనే మునుగోడ్ కు ఉప ఎన్నికలు వచ్చాయని అన్నారు.

మునుగోడ్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి TRS తోనే సాధ్యమని, ముఖ్యమంత్రి పాలన పై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని చెప్పారు.నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న TRS పార్టీ వెంటే ప్రజలు ఉన్నారని, మునుగోడ్ ఎన్నికలలో TRS అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube