కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఇంఛార్జ్ ప్రవీణ్ కుమార్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.ప్రొద్దుటూరు పట్టణ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ నారాయణమ్మ డ్వాక్రా మహిళలను మోసం చేసిందని, అందుకు టీడీపీ ఇంఛార్జ్ వత్తాసు పలుకుతున్నారంటూ మహిళలు నిరసనకు దిగారు.
ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ ఇంటి వద్దకు వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.అనంతరం ప్రవీణ్ ఇంటిపైకి రాళ్లు రువ్వారు.
దీంతో 29వ వార్డు టీడీపీ ఇంచార్జ్ తలకు గాయమైనట్లు సమాాచారం.సమాచారం అందుకున్న పోలీసులు.
ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి ప్రయత్నించారు.శాంతిభద్రతలు అదుపులోకి రాకపోవడంతో లాఠీ ఛార్జ్ చేశారు.
దీంతో పరిస్థితి సద్దుమణిగింది.తమకు న్యాయం చేయాలని మహిళలు కోరుతున్నారు.