ఢిల్లీ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది.ఇటీవల దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్ ను గెలిచిన భారత జట్టు, తాజాగా వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది.
చివరి మూడో వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.ముందుగా దక్షిణాఫ్రికాను 99 పరుగులకే కట్టడి చేసింది భారత్.అనంతరం 100 పరుగుల లక్ష్యాన్ని కేవలం 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను భారత్ 2-1తో చేజిక్కించుకుంది.