భారీ ధరలకు అమ్ముడుపోయిన సూర్య-శివ సినిమా డిజిటల్ రైట్స్.. ఎన్ని కోట్లో తెలుసా?

కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నటుడు సూర్య.ఈయన తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

 Digital Rights Of Surya Shiva Movie Sold At Huge Prices Do You Know How Many Cro-TeluguStop.com

ఈ క్రమంలోనే సూర్య నటించిన సినిమాలకు తెలుగులో కూడా మంచి ఆదరణ వస్తుంది.ఇకపోతే సూర్య ఈ మధ్యకాలంలో వరుస సినిమా విజయాలను అందుకొని దూసుకుపోతున్నారు.

తాజాగా ఈయన ఆకాశమే నీ హద్దురా సినిమాకి జాతీయ అవార్డును కూడా అందుకున్నారు.

ఇకపోతే సూర్య ప్రస్తుతం దర్శకుడు శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇక ఈ సినిమా గురించి తాజాగా ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటున్న నేపథ్యంలోనే ఈ సినిమా భారీ బిజినెస్ జరుపుకొందని తెలుస్తోంది.ఈ సినిమాకి ప్రముఖ ఓటీటీ సంస్థ నుంచి భారీ డీల్ వచ్చినట్లు సమాచారం.

శివ సూర్య కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా కోసం ప్రముఖ డిజిటల్ మీడియా ఏకంగా 100 కోట్ల రూపాయలకు సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ఆ సంస్థ ఏది అనేది తెలియకపోయినా ఈ విషయం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమాతో పాటు సూర్య వెట్రిమారన్‌ దర్శకత్వంలోనూ సూర్య ఓ చిత్రంలో నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube