జాతీయ నటుడిగా అవార్డు అందుకున్న నటుడు ధనుష్ గురించి తెలియని ప్రేక్షకులు లేరు.ఈయన కోలీవుడ్ లో స్టార్ హీరోల్లో ఒకరు అయితే ధనుష్ అక్కడే ఉండిపోకుండా ఇటు తెలుగుతో పాటు హిందీ, హాలీవుడ్ మూవీస్ లో కూడా తనని తాను నిరూపించు కునేందుకు తీవ్రంగా కష్టపడు తున్నాడు.
ధనుష్ నటిస్తున్న సినిమాలన్నీ డబ్బింగ్ అయ్యి తెలుగులో కూడా రిలీజ్ అవుతూనే ఉన్నాయి.కానీ ఈయన మార్కెట్ పెంచుకోవడంతో మాత్రం కొద్దిగా వెనుకబడి ఉన్నాడు.
ధనుష్ తెలుగులో కమర్షియల్ హిట్ సాధించలేదు.దీంతో ఈయన డైరెక్ట్ తెలుగు సినిమాతో వచ్చి ఇక్కడ కూడా మార్కెట్ సాధించాలని చూస్తున్నాడు.
ప్రెసెంట్ ధనుష్ తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించాడు.
అయితే అంత కంటే ముందు తాను నటించిననేనే వస్తున్నసినిమా భారీ రిలీజ్ కు ప్లాన్ చేసాడు.ఏకంగా అల్లు అరవింద్ సమర్పణలో రిలీజ్ చేయడానికి సిద్ధం అయ్యాడు.
ఈ సినిమా సెప్టెంబర్ 29న రిలీజ్ కాబోతుంది.కోలీవుడ్ సినిమా పొన్నియన్ సెల్వన్ కంటే ఒక్కరోజు ముందు రాబోతుంది.
ఈ సినిమా కోసం అయినా ధనుష్ వాయిదా వేసుకుంటాడేమో అని అనుకున్నారు.కానీ ఈయన మాత్రం ఆ సినిమాతో నాకు సంబంధం లేదు అంటూ ముందుకు వస్తున్నాడు.
మరి ఇందుకు కారణం తెలుగు మార్కెట్ అని తెలుస్తుంది.

తెలుగులో వచ్చే వారం ఒక్క సినిమా కూడా లేనందున ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు.అందుకే ఈ సినిమా ఖచ్చితంగా భారీ విజయం సాధిస్తుంది అని ధనుష్ భావించి తమిళ్ లో పొన్నియన్ సెల్వన్ కారణంగా కలెక్షన్స్ తగ్గిన పర్వాలేదు అనుకుని ఈ సినిమాను తెలుగు మార్కెట్ కోసం రిలీజ్ చేస్తున్నాడని తెలుస్తుంది.అందులోను హాలిడేస్ కారణంగా మరింతగా వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయని అలోచించి ధనుష్ ఈ నిర్ణయం తీసుకున్నాడట.
చూడాలి ఈయన ప్లాన్ ఎంత వర్కౌట్ అవుతుందో.