తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది.దీనిలో ఏఐసీసీ అధ్యక్షుడుగా రాహుల్ గాంధీనే ఎన్నిక కావాలని కోరుతూ రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు.
కాగా ఈ తీర్మానానికి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజకీయ తీర్మానాన్ని బలపరిచారు.అనంతరం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ, ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ ఛైర్మన్ తదితరులు బలపరిచారు.
దేశ అభివృద్ధి కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు.ప్రస్తుతం దేశం సంక్షోభ పరిస్థితుల్లో ఉందన్న ఆయన.
దేశాన్ని కాపాడేందుకే భారత్ జోడో యాత్ర చేపట్టారని పేర్కొన్నారు.