RBI తాజా శుభవార్త చెప్పింది.. ఈ బ్యాంక్ కస్టమర్లు ఇక పండగ చేసుకోవచ్చు!

RBI (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.సెప్టెంబర్ 20న ప్రభుత్వ రంగానికి చెందిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సత్వర దిద్దుబాటు చర్యల ఆంక్షల నుంచి బయటకు తీసుకువచ్చింది.అయితే బ్యాంక్‌పై RBI పర్యవేక్షణ మాత్రం కొనసాగుతుందని పేరొంది.“2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ గణాంకాలను పరిశీలిస్తే.సత్వర దిద్దుబాటు చర్యల నిబంధనలను అతిక్రమించలేదని తెలుస్తోంది” అని RBI పేర్కొంది.అంతేకాకుండా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBIకి ఒక లిఖిత పూర్వక హామీ పత్రాన్ని సమర్పించింది.

 Rbi Has Given The Latest Good News Customers Of This Bank Can Now Celebrate-TeluguStop.com

మినిమమ్ రెగ్యులేటరీ క్యాపిటల్ కలిగి ఉంటామని, నికర మొండిబకాయిలు అండ్ లెవరేజ్ రేషియోను పాటిస్తామని ఈ బ్యాంక్ RBIకి హామీ ఇచ్చింది.RBI నిర్దేశించిన ప్రమాణాలను పాటించడం వల్ల బ్యాంక్ పనితీరు మెరుగుపడిందని చెప్పుకోవచ్చు.RBI సత్వర దిద్దుబాటు చర్యల ఆంక్షల్లో ఉన్న ఒకే ఒక బ్యాంక్‌గా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నాళ్లు కొనసాగుతూ వచ్చింది.2017 జూన్ నుంచి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI పీసీఏ ఫ్రేమ్‌వర్క్‌లో ఉంది.మొండి బకాయిలు ఎక్కువగా ఉండటం ఇందుకు ప్రధాన కారణం.

Telugu Bank Holders-Latest News - Telugu

అలాగే అసెట్స్ మీద తక్కువ రాబడి అంశం కూడా ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.బ్యాంకులు నిర్దిష్టమైన నిబంధనలు అతిక్రమించినప్పుడు RBI ఆ బ్యాంకులపై పీసీఏ చర్యలకు దిగుతుంది.రిటర్న్ ఆన్ అసెట్, మినిమమ్ క్యాపిటల్, మొండి బకాయిలు వంటి అంశాల్లో బ్యాంక్ పనితీరు ఆధారంగా పీసీఏ ఫ్రేమ్‌వర్క్ అమలు చేయాలా? వద్దా? అంశం ఆధారపడి ఉంటుంది.RBI తాజా నిర్ణయంతో ఇకపై ఒక్క బ్యాంక్ కూడా పీసీఏ ఫ్రేమ్‌వర్క్‌లో లేదని చెప్పుకోవచ్చు.కాగా RBI పీసీఏ ఆంక్షలను ఎదుర్కొనే బ్యాంకులకు స్వచ్ఛ ఉండదు.రిజర్వు బ్యాంక్ చెప్పింది చేయాల్సి ఉంటుంది.ఇందులో ఏ మార్పు ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube