తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీజేపీ గట్టి ప్రయత్నమే చేస్తుంది.ఇందుకు తగ్గట్టుగా తెలంగాణ నేతలకు ఢిల్లీలోని బీజేపీ పెద్దలు గైడ్ చేస్తున్నారు.
తెలంగాణలో వచ్చే సాధారణ ఎన్నికలలో ప్రజల నాడిని తెలుసుకునేందుకు బీజేపీ పశ్చిమ బెంగాల్ తరహ వ్యూహంతోనే ముందుకెళ్లాలని చూస్తుంది.దీని కోసం పబ్లిక్ మూడ్ పేరుతో రహస్య సర్వే చేపట్టాలని నిర్ణయించింది.
దీనికి దేశంలోనే అత్యున్నతమైన బిజినెస్ స్కూల్స్‌కు సంబంధించిన ఓ బృందాన్ని అమిత్ షా రంగంలోకి దించినట్లు సమాచారం.అయితే ఈ బృందం లోకల్ లీడర్స్‌తో సంబంధం లేకుండా స్వతంత్రంగా సర్వే నిర్వహించనుంది.
ఒక్క వేళ రాష్ట్ర బీజేపీ నేతల సంప్రదించి సర్వే నిర్వహిస్తే సర్వే ఫలితాలు పారదర్శకంగా వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చునని భావిస్తున్నారు.ఫలితంగా రాష్ట్ర బీజేపీ నేతలను పరిగణలోకి తీసుకోకుండానే స్వతంత్రంగా ఈ సర్వే పని కానిచ్చేయాలని ఆ బృందానికి ఆదేశాలు వెళ్లాయి.
ఏమైన సమస్యలు ఉంటే నేరుగా ఢిల్లీలోని బీజేపీ పెద్దలనే సంప్రదించే అవకాశం వారికి ఇచ్చారు.

బృందంలోని కొంత మంది ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన సర్వేలో నిమగ్నమైంది.ఈ బృందాలు మునుగోడులో బీజేపీకి ఉన్న బలాలు, బలహీనతలపై సర్వే నిర్వహిస్తుంది.ఈ ఫలితాలను ఎప్పటికప్పుడు అధిష్ఠానానికి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నాయి.
అలాగే నియోజరవర్గ ఇంచార్జ్‌ల విషయంలోనే బీజేపీ అధిప్టానం అచితూచి వ్వవహరిస్తుంది.టికెట్ల పంపిణీ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది.
ఏ నియోజకవర్గాల్లో ఏ బలమైన సామాజిక వర్గం ఓట్లను ప్రభావితం చేస్తోందో ఆ వర్గం అభ్యర్థికి టికెట్ ఇవ్వొచ్చా అనే అంశాలను టీమ్ కసరత్తు చేస్తుంది.