చంద్రబాబు స్వార్థ రాజకీయాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పాతాళంలోకి : ఎంపీ మోపిదేవి

చంద్రబాబు స్వార్థ రాజకీయాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పాతాళంలోకి నెట్టబడింది.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది.

 Ysrcp Mp Mopidevi Venkata Ramana Comments On Chandrababu , Ysrcp Mp Mopidevi Ve-TeluguStop.com

ఈ పరిస్థితిని అధిగమించి రాష్ట్రానికి జాతీయ స్థాయిలో సంక్షేమ రథసారథిగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక స్థానం గుర్తింపు లభించింది.సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం, నీతి అయ్యోగ్ కమిషన్ చెప్పిన మాటలు వాస్తవం.

జగన్మోహన్ రెడ్డి పదికాలాలపాటు కొనసాగితే తమ పేదరికం తొలగిపోయి అధికంగా నిలదొకుంటామని ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు.ఈ పరిస్థితుల్లో తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు ఒడిగట్టాడు.

అమరావతి నుంచి అరసవల్లి వరకు రైతు పాదయాత్ర పేరుతో టిడిపి బల ప్రదర్శన యాత్ర నిర్వహిస్తున్నారు.తెలంగాణ విడిపోయాక 10 సంవత్సరాల పాటు హైదరాబాదులో రాజధాని కార్యకలాపాలు కొనసాసించుకోవచ్చునని సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా చేసిన చట్టాన్ని చంద్రబాబు తన స్వార్థం కోసం అధిగమించారు.

ఓటుకు నోటు కేసులో దొరికిపోయి కేసీఆర్ అరెస్టు చేస్తారనే భయంతో రాత్రికి రాత్రి హైదరాబాద్ కాలి చేసి వచ్చేశారు.

ఆంధ్రప్రదేశ్ సరైన రాజధాని ఎంపిక చేయడంలో కూడా చంద్రబాబు స్వార్థం చూపారు.

అమరావతి ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద రైతుల నుంచి బలవంతంగా వేల ఎకరాల భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని స్థాపించారు.తమ సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారరులు, పెయిడ్ ఆర్టిస్ట్ లతో రైతుల మాదిరిగా పాదయాత్ర చేస్తుడటం సిగ్గుచేటు.

చంద్రబాబు హయాంలో తాత్కాలిక భవనాలు పెరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు.ఐదేళ్ల కాలంలో ఒక్క పింఛను తప్ప ఎటువంటి పథకాల అమలు చేయలేదు.

చంద్రబాబు రాష్ట్రాన్ని లక్షా యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు పాలు చేశారు.అప్పులు ఎందుకు చేశారో సమాధానం చెప్పాలి.

భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లోని ఏ ప్రాంతంకు అన్యాయం జరగకూడదని ముందుచూపుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యతగా మూడు రాజధానులు అంశాని ప్రతిపాదించి ఆమోదించారు.జగన్మోహన్రెడ్డి నిర్ణయంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి బాట పడుతున్నాయి.

పరిపాలన రాజధానిగా అభివృద్ధి చెందిన విశాఖపట్నం చట్ట సభల నిర్వహణకు రాజధానిగా అమరావతి న్యాయ రాజధాని కర్నూలును ప్రకటించారు.దీని వల్ల అన్ని ప్రాంతాలకు పరిశ్రమలు పెట్టుబడులు వచ్చి రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తోంది.

దీంతో నష్టపోతామని చంద్రబాబు కుట్ర పూరిత రాజకీయాలతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ రైతుల యాత్రపేరుతో కార్పొరేటర్ల యాత్రకు తెరలేపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube