ఏపీలో ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ అక్కడ మాత్రం రాజకీయాలు ఇప్పటినుండే వేడెక్కుతున్నాయి.వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారం నిలబెట్టుకునే దిశగా వైసీపీ మాస్టర్ ప్లాన్ సిద్దం చేసింది.
ఇప్పటి నుండే ప్రధాన ప్రతిపక్షం టీడీపీని కట్టడి చేయాలని నిర్ణయించుకుంది.పార్టీ ముఖ్య నేతలు చంద్రబాబు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, దేవినేని ఉమ, నిమ్మల నాయుడు, పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి కీలక నేతల నియోజకవర్గాలను టార్గెట్ చేసుకుంది వైసీపీ.
ముఖ్య నేతలను వారి నియోజకవర్గాలకే కట్టడి చేయడం ద్వారా ఇతర నియోజకవర్గాల్లో వారు ప్రచారం చేయకుండా చూసుకుంటుంది.ఈ వ్యూహాంలో భాగంగా నియోజకవర్గాల అభివృద్ది నిధుల కింద చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంకు రూ.66 కోట్లు, మంగళగిరిలో మరోసారి నారా లోకేష్‌ను ఓడించేందుకు అభివృద్ధి పనుల రూ.133.11 కోట్లు విడుదల చేసింది.
చాలాకాలంగా కుప్పం, మంగళగిరిపై పెద్దగా పోకస్ పెట్టని వైసీపీ.
ఈ నియోజకవర్గాల్లో చంద్రబాబు, లోకేష్ యాక్టీవ్ అవుతుండడంతో వారి ప్రాబల్యం తగ్గించడానికి ఈ విధమైన వ్యూహా రచన చేసింది.ఈ రెండు నియోజక వర్గాలే కాకుండా రాష్ట్రంలో మిగిలిన 173 నియోజకవర్గాల్లో భారీగా నిధులు విడుదల చేసి అభివృద్ధి చేయాలని చూస్తుంది.
అంతేకాకుండా ఇటీవలే సర్వేలో వైసీపీలోని 50-60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని వెల్లడైన నేపథ్యంలో వారిని మార్చక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి.అలాగే త్వరలో మళ్ళీ మంత్రివర్గంలో మార్పులు చేయనున్నారు.
ఇక వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాల అజెండాతోనే ముందుకు వెళ్ళాలని చూస్తున్నారు.ఇందులో భాగంగా గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమానికి చేపట్టారు.రాష్ట్రంలో మూడేళ్లుగా సంక్షేమ అజెండాగానే వైసీపీ సర్కార్ పాలన సాగుతుంది.నిధుల కోసం భారీగా అప్పులు చేస్తోంది.ఇది కాక మూడు రాజధానుల అజెండా కూడా వైసీపీకి కలిసి వచ్చేలా ప్రణాళికలు రచిస్తుంది.