ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మూడు రాజధానుల బిల్ కుదిపేస్తోంది.టీడీపీ నేతలు వైయస్ జగన్ వైఖరి పై మండిపడుతున్నారు.
ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ఉన్న సమయంలో అమరావతికి ఓకే చెప్పి తర్వాత అధికారంలోకి వచ్చి మూడు రాజధానులు అని కొత్త అంశాన్ని తెరపైకి తీసుకురావడం పట్ల విమర్శలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ అసెంబ్లీ సమావేశాలలో మూడు రాజధానుల బిల్లు తీసుకురానున్నట్లు వస్తున్న వార్తలపై ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకే మూడు రాజధానులు బిల్లు పెడతామంటున్నారని వ్యాఖ్యానించారు.
రాజధానిపై ఇప్పటికే హైకోర్టు తీర్పు ఇచ్చిందని, ఆ తీర్పుపై ప్రభుత్వం ఆపిల్ కు వెళ్లలేదని.గుర్తు చేశారు.ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రతిపక్షం పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.కేసు నమోదు చేయకపోతే కోర్టుకు వెళ్లాలని రఘురామకృష్ణరాజు కోరారు.