సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఎవరి ఫేట్ ఎలా మారిపోతుంది అన్నది చెప్పలేని విధంగా ఉంటుంది.అప్పటివరకు అసలు ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులు సంపాదించలేకపోయిన నటులు ఒక్క సినిమాతో స్టార్ గా ఎదగడం లాంటివి జరుగుతూ ఉంటుంది.
అదే సమయంలో అప్పటివరకు స్టార్లుగా కొనసాగుతున్న వారు ఆ తర్వాత కనుమరుగయ్యే పరిస్థితి వస్తూ ఉంటుంది అని చెప్పాలి.ముఖ్యంగా హీరోయిన్లకు ఇండస్ట్రీలో రాణించడం అనేది ఒక పెద్ద సవాల్ లాంటిది.
కథల ఎంపికలో ఒక్క తప్పటడుగు వేసిన కూడా కెరీర్ మొత్తం నాశనం అవుతూ ఉంటుంది.
ఇప్పటివరకు చిత్ర పరిశ్రమలో ఒకటి రెండు సినిమాలు హిట్లు సాధించి ఒక్కసారిగా ఫేమస్ అయ్యి.
అవకాశాలు అందుకోలేకపోయిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు.ఆ లిస్టు చూసుకుంటే.
కేథరిన్ :
ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అందరినీ కట్టిపడేసే అందం ఆమె సొంతం.
టాలెంట్ కూడా పుష్కలంగానే ఉంది.కెరియర్ మొదట్లో అడపాదడపా హిట్స్ కూడా కొట్టింది.
పెద్ద హీరోల సినిమాల్లో అవకాశం దక్కించుకుంది.కానీ తగిన గుర్తింపు మాత్రం ఈ అమ్మడికి రాలేదు ఇంకా సరైన స్టార్ డం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
సంయుక్త మీనన్ :
ఇటీవలే వచ్చిన బిందుసార అంతకు ముందు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ గా నటించింది.ఈ అమ్మడి అందానికి అందరూ ఫిదా అయిపోయారు.2 సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.కానీ ఈ రెండు సినిమాలు సంయుక్త కెరియర్కు ఎక్కడ ఉపయోగపడలేదు.
అనుపమ పరమేశ్వరన్
: కుర్రకారు మతి పోగొట్టే అందం ఈ మలయాళ బ్యూటీ సొంతం. శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఆ సినిమాతో ఇండస్ట్రీ లో సెకండ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత బోలెడన్ని అవకాశాలు అందుకుంది.కానీ ఇంకా సరైన గుర్తింపు సాధించలేకపోయింది.కార్తికేయ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన స్టార్ హీరోయిన్ రేసులో కి మాత్రం రాలేకపోయింది అనుపమ పరమేశ్వరన్.