మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వరుణ్.. ఈసారి వైష్ణవ్ డైరెక్టర్ తో..

టాలీవుడ్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ తన నటనలో వేరియేషన్స్ చూపిస్తు ప్రేక్షకుల మదిలో నిలిచి పోతున్న హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు.వరుణ్ మొదటి నుండి కూడా డేరింగ్ స్టెప్పులు వేస్తూ ఆడియెన్స్ ను తన నటనతో అలరిస్తున్నాడు.

 Varun Tej Next Movie With Girishayya , Vaishnav Tej, Ranga Ranga Vaibhavanga, Di-TeluguStop.com

మిగతా మెగా హీరోల కంటే కూడా తెలివిగా డిఫెరెంట్ జానర్ సినిమాలు చేస్తూ ఈయనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకోవడంలో సఫలం అయ్యాడు.

ఇటీవలే వరుణ్ తేజ్ గని సినిమాతో వచ్చాడు.

ఈ సినిమా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కింది. అల్లు బాబీ, సిద్ధూ నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి అట్టర్ ప్లాప్ అయ్యింది.

అయితే ఈ సినిమా ఫెయిల్ అయినా వెంటనే ఎఫ్ 3 సినిమాతో వచ్చి వెంటనే సూపర్ హిట్ అందుకున్నాడు వరుణ్.

ఇక ఇప్పుడు వరుణ్ తన 12వ సినిమాను ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

ఇది కూడా డిఫెరెంట్ జానర్ లో తెరకెక్కుతుంది.ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసి రెగ్యురల్ షూట్ కు రెడీ అవుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బైనార్ పై బివిఎస్ఎన్ నిర్మిస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా తాజాగా వరుణ్ తేజ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఊహాగానాలు మొదలయ్యాయి.

Telugu Girishayya, Gani, Praveen Sattar, Rangaranga, Vaishnav Tej, Varun Tej, Va

అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గిరీశయ్య కు వరుణ్ ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.ప్రెజెంట్ ఈ డైరెక్టర్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో ‘రంగరంగ వైభవంగా‘ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా సెప్టెంబర్ 2న రిలీజ్ కాబోతుంది.

ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.బివిఎస్ఎన్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.

Telugu Girishayya, Gani, Praveen Sattar, Rangaranga, Vaishnav Tej, Varun Tej, Va

ఈ సినిమా తర్వాత సేమ్ బ్యానర్ లో గిరీశయ్య మరో సినిమాకు కమిట్ అయ్యారని.అన్ని ఓకే అయితే వరుణ్ తేజ్ తోనే ఈ సినిమా ఉందనున్నట్టు తెలుస్తుంది.రంగరంగ వైభవంగా సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.

చూడాలి ఏం జరుగుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube