కరోనా తర్వాత ప్రేక్షకుల్లో చాలా మార్పులు వచ్చాయి.వారి ఆలోచనలో మాత్రమే కాదు.
అభిరుచిలో కూడా మార్పులు రావడంతో థియేటర్స్ కు వెళ్లడమే మానేశారు.సినిమా ఎంతో హిట్ టాక్ వస్తే తప్ప అటు చూడడం లేదు.
అలాగే నటీనటుల పారితోషికాలు, నిర్మాణ వ్యయం అంతా పెరగడంతో నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చాయి.దీంతో ఈ పరిస్థితిలో మార్పు తీసుకు కోసం ప్రొడ్యూసర్ గిల్డ్ షూటింగుల బంద్ కు పిలుపునిచ్చారు.
దీంతో ఆగష్టు 1 నుండి సినీ పెద్దలు టాలీవుడ్ లో నెలకొన్న అన్ని సమస్యలపై చర్చలు జరిపారు.తాజాగా వీరంతా ఆర్టిస్టుల రెమ్యునరేషన్ పై కూడా కొన్ని నిబంధనలు పెట్టారట.
ఈ నిర్ణయం విన్న రవితేజ తాజాగా ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారట.రవితేజ ప్రెజెంట్ 18 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు.
మూడేళ్ళలో ఈయన 12 కోట్ల నుండి 18 కోట్లకు పెంచుకుంటూ వచ్చాడు.
ఈయన సినిమాలు వరుసగా ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఈయనకు మంచి క్రేజ్ ఉండడంతో నిర్మాతలు ఈయన డిమాండ్ చేసినంత ఇస్తున్నారు.
అయితే ఇక నుండి రవి తేజ నెక్స్ట్ 2 ఇయర్స్ వరకు తన పారితోషికాన్ని పెంచకూడదు అని నిర్ణయం తీసుకున్నాడట.ఇందుకు కారణం గిల్డ్ తాజాగా రెమ్యునరేషన్ లపై తీసుకున్న నిర్ణయమే అని తెలుస్తుంది.
అలాగే రవితేజ నిర్మాతల నుండి రెమ్యునరేషన్ కు మించి అదనపు ఖర్చు కూడా తీసుకో కూడదు అని అయ్యారట.
ఇక ఇటీవలే ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో రెండు ప్లాప్స్ అందుకున్న ఈయన ప్రెజెంట్ మరో మూడు సినిమాలను లైన్లో పెట్టాడు.ప్రెజెంట్ రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమా, సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర, వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు సినిమాలు చేస్తున్నాడు.అలాగే మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.