బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోలో ఛాన్స్ వస్తే చాలు అనుకునే కంటెస్టెంట్ల సంఖ్య ఎక్కువగానే ఉందనే సంగతి తెలిసిందే.బిగ్ బాస్ సీజన్6 లో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ ఈ మధ్య కాలంలో ఎన్నో పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే బిగ్ బాస్ సీజన్6 కు వెళ్లే కంటెస్టెంట్ల జాబితా ఫైనల్ అయింది.గతంలో వినిపించిన పేర్లలో కొంతమంది ఈ జాబితాలో ఉండగా మరి కొందరు కొత్తగా ఈ జాబితాలో చేరడం గమనార్హం.
ఈ జాబితాలో ఉన్న కంటెస్టెంట్లలో మెజారిటీ కంటెస్టెంట్లు బిగ్ బాస్6 లో కచ్చితంగా కనిపించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.ఈ జాబితాలో కొత్తగా చేరిన వాళ్లలో అభినయశ్రీ ఒకరు.
నటిగా, స్పెషల్ సాంగ్స్ చేయడం ద్వారా అభినయశ్రీ ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు.ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన జబర్దస్త్ ఫైమా కూడా బిగ్ బాస్ షోలో సందడి చేయనున్నారని తెలుస్తోంది.
గలాటా గీతూ కూడా బిగ్ బాస్ షోలో కనిపించనున్నారని బోగట్టా.
బాలాదిత్య, జబర్దస్త్ తన్మయి, చంటి, ఆదిరెడ్డి, ఆరోహి రావు కూడా బిగ్ బాస్ లో ఉండబోతున్నారని బోగట్టా.వసంతి కృష్ణన్, దీపికా పిల్లి, సుదీప, అర్జున్ కళ్యాణ్ కూడా ఈ షోలో సందడి చేయనున్నారు.రేవంత్, ఇనయా సుల్తానా, నేహా చౌదరి కూడా ఈ షోలో ఉన్నారని బోగట్టా.
శ్రీహాన్ కూడా ఈ షోలో ఉన్నారని తెలుస్తోంది.
సీరియళ్లు, వెబ్ సిరీస్ ద్వారా పాపులర్ అయిన శ్రీసత్య కూడా బిగ్ బాస్ షోలో ఉండనున్నారని తెలుసోంది.మెరీనా రోహిత్ కపుల్ గా ఈ షోలోకి రానున్నారని బోగట్టా.సుధీర్, సంధ్య అనే పేర్లతో ఉన్న సామాన్యులు ఈ షోలోకి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.
వీళ్లు క్వారంటైన్ లోకి వెళ్లనున్నారని సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ఈ షో ప్రసారం కానుందని తెలుస్తోంది.