యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది.తారక్ రాజమౌళి కాంబినేషన్ లో 4 సినిమాలు తెరకెక్కగా ఈ 4 సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఘనవిజయం సాధించాయి.
స్టూడెంట్ నంబర్1 సినిమాతో తారక్ రాజమౌళి ఒకే సమయంలో కెరీర్ ను మొదలుపెట్టగా ఈ సినిమా సక్సెస్ సాధించడంతో అటు తారక్ కు ఇటు రాజమౌళికి ప్రేక్షకుల్లో మంచి పేరు వచ్చింది.ఆ తర్వాత ఈ కాంబినేషన్ లో సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ సినిమాలు తెరకెక్కాయి.
అయితే ఆర్ఆర్ఆర్ విషయంలో తారక్ తన అభినయంతో ఊహించని స్థాయిలో మెప్పించినా క్లైమాక్స్ లో తారక్ కు కొంతమేర ప్రాధాన్యత పెంచి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ భావించారు.ఆర్ఆర్ఆర్ వల్ల తారక్, జక్కన్న మధ్య కొంత గ్యాప్ వచ్చిందని కూడా కామెంట్లు వినిపించాయి.
అయితే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అమిత్ షాతో తారక్ భేటీ ద్వారా గ్యాప్ ను తగ్గించారని బోగట్టా.
ఈ భేటీ వల్ల అటు అమిత్ షాకు ఇటు జూనియర్ ఎన్టీఆర్ కు కచ్చితంగా బెనిఫిట్ కలుగుతోంది.
అమిత్ షా తారక్ ను కలవడం వల్ల దేశవ్యాప్తంగా తారక్ గురించి మరోసారి చర్చ జరుగుతోంది.ఇప్పుడు కాకపోయినా తారక్ భవిష్యత్తులో బీజేపీలో యాక్టివ్ కావాలనుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
మునుగోడు ఎన్నిక నేపథ్యంలో బీజేపీ అందరినీ కలుపుకొనిపోవాలనే భావనలో ఉండటం గమనార్హం.
ఈ భేటీ ద్వారా రాజమౌళి తారక్ బాకీ తీర్చేసుకున్నాడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రాబోయే రోజుల్లో తారక్ జక్కన్న కాంబినేషన్ లో మరో సినిమా రావచ్చని మహేష్ జక్కన్న కాంబో మూవీ తర్వాత ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.