కొన్ని సినిమాలపై విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేకపోయినా ఆ సినిమాలు విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుంటాయి.అలా సంచలనాలు సృష్టించిన సినిమాలలో కార్తికేయ2 సినిమా ఒకటి కావడం గమనార్హం.కార్తికేయ2 కార్తికేయ సినిమాకు సీక్వెల్ అని ప్రకటన వెలువడిన సమయంలో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు ఏర్పడలేదు.అయితే ట్రైలర్ బాగుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి.
సినిమా రిలీజైన తర్వాత క్రిటిక్స్ నుంచి పాజిటివ్ గా రివ్యూలు రావడంతో పాటు మౌత్ టాక్ కూడా బాగుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి.బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ తో పోల్చి చూస్తే ఈ సినిమా రెట్టింపు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది.
నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమాకు అంచనాలకు మించి కలెక్షన్లు వస్తుండటం గమనార్హం.హిందీలో డబ్ చేయడం ఈ సినిమాకు ఒక విధంగా కలిసొచ్చింది.
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ ఏడాది విడుదలైన ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాల కంటే కార్తికేయ2 బిగ్గెస్ట్ హిట్ అని వెల్లడించారు.మౌత్ టాక్ తో కార్తికేయ2 భారీ కలెక్షన్లను సాధిస్తుండటంతో వర్మ చెప్పిన లెక్కలు నిజమేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
![Telugu Ram Gopal Varma, Karthikeya, Kgf Chapter, Netizens-Movie Telugu Ram Gopal Varma, Karthikeya, Kgf Chapter, Netizens-Movie](https://telugustop.com/wp-content/uploads/2022/08/netizens-comments-about-karthikeya2-movie-ram-gopal-varma-comments-detailss.jpg)
కార్తికేయ2 ఫుల్ రన్ లో 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
కార్తికేయ2 సక్సెస్ తో నిఖిల్ తర్వాత సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.కొన్ని నెలల గ్యాప్ లోనే నిఖిల్ హీరోగా తెరకెక్కిన మూడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయని సమాచారం అందుతోంది.సినిమాసినిమాకు నిఖిల్ రేంజ్ పెరుగుతుండగా తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా నిఖిల్ సత్తా చాటాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.