ఓటీటీలో దూసుకెళ్తోన్న‌ లెస్బియ‌న్ చిత్రం `హోలీ వుండ్‌`

స‌హ‌స్ర సినిమాస్ ప్రై.లి స‌మ‌ర్ప‌ణ‌లో జాన‌కి సుంద‌ర్‌, అమృతా వినోద్‌, సాబు ప్రౌదిక్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సందీప్ ఆర్ మ‌ల‌యాళంలో నిర్మించిన చిత్రం `హోలీవుండ్‌`.

 Holy Wound Movie Running Successfully In Ott, Holy Wound Movie, Ss Frames Off, D-TeluguStop.com

అశోక్ ఆరాన్ ద‌ర్శ‌కుడు.లెస్బియ‌న్ నేప‌థ్యంలో రూపొందిన ఈ సైలెన్స్ సినిమా ఎన్నో కాంట్ర‌వ‌ర్సీల మ‌ధ్య ఈ నెల 12న ఎస్ ఎస్ ఫ్రేమ్స్ ఓటీటీ ద్వారా గ్రాండ్ గా రిలీజై మొద‌టి రోజే ల‌క్ష‌ల మంది వీక్ష‌కుల మ‌న‌సు దోచుకుంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత మాట్లాడుతూ…“మ‌ల‌యాళంలో వ‌చ్చిన మొద‌టి లెస్బియ‌న్ చిత్రానికి బుకింగ్స్ చూసి మేమే ఆశ్చ‌ర్య‌పోయాం.వేరే ఓటీటీల్లో ల‌క్ష‌ల్లో వీక్ష‌కులు అవ‌కాశం త‌క్కువ‌.ఎస్ ఎస్ ఫ్రేమ్స్ లో కేవ‌లం 18 గంట‌ల్లో మూడు ల‌క్ష‌ల మంది సినిమా చూశారు.ఈ చిత్రం చూడ‌టానికి ఓటీటీ యాప్ డౌన్ లోడ్ అవ‌స‌రం లేదు.

పైన ఉన్న వెబ్ సైట్ ఓపెన్ చేసి టిక్కెట్ బుక్ చేసుకోవ‌చ్చు.మ‌ల‌యాళంలో ఇంత‌గా ప‌బ్లిసిటీ…చేసిన లెస్బియ‌న్ సినిమా లేదు.

ఈ సినిమా కోసం ఎంతో మంది యువ‌కులు ఎదురు చూశారు.సినిమా చూశాక వాళ్లు ఎదురు చూసిన దానికి మించి ఉందంటూ చెప్పడం విశేషం.

ఈ చిత్రాన్ని 18 ఏళ్ల లోపు పిల్ల‌లు చూడ‌కూడదు.ఇంకా ఈ సినిమా పై కొంత మంది రాజ‌కీయం చేస్తున్నారు కానీ.

అలాంటి కాంట్ర‌వ‌ర్సీ చిత్ర‌మిది కాదు“ అన్నారు.

ఈ చిత్రానికి డీఓపిః ఉన్ని మాధ‌వూర్‌; సంగీతంః రోన్ రాఫిల్ ; స్క్రీన్ ప్లేః పాల్ విక్‌లిఫ్‌; ఎడిటింగ్ః విపిన్ మానూర్; ద‌ర్శ‌కుడుః అశోక్ ఆరాన్‌, నిర్మాతః సందీప్ ఆర్‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube