ఓటీటీలో దూసుకెళ్తోన్న‌ లెస్బియ‌న్ చిత్రం `హోలీ వుండ్‌`

స‌హ‌స్ర సినిమాస్ ప్రై.లి స‌మ‌ర్ప‌ణ‌లో జాన‌కి సుంద‌ర్‌, అమృతా వినోద్‌, సాబు ప్రౌదిక్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సందీప్ ఆర్ మ‌ల‌యాళంలో నిర్మించిన చిత్రం `హోలీవుండ్‌`.

అశోక్ ఆరాన్ ద‌ర్శ‌కుడు.లెస్బియ‌న్ నేప‌థ్యంలో రూపొందిన ఈ సైలెన్స్ సినిమా ఎన్నో కాంట్ర‌వ‌ర్సీల మ‌ధ్య ఈ నెల 12న ఎస్ ఎస్ ఫ్రేమ్స్ ఓటీటీ ద్వారా గ్రాండ్ గా రిలీజై మొద‌టి రోజే ల‌క్ష‌ల మంది వీక్ష‌కుల మ‌న‌సు దోచుకుంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత మాట్లాడుతూ.``మ‌ల‌యాళంలో వ‌చ్చిన మొద‌టి లెస్బియ‌న్ చిత్రానికి బుకింగ్స్ చూసి మేమే ఆశ్చ‌ర్య‌పోయాం.

వేరే ఓటీటీల్లో ల‌క్ష‌ల్లో వీక్ష‌కులు అవ‌కాశం త‌క్కువ‌.ఎస్ ఎస్ ఫ్రేమ్స్ లో కేవ‌లం 18 గంట‌ల్లో మూడు ల‌క్ష‌ల మంది సినిమా చూశారు.

ఈ చిత్రం చూడ‌టానికి ఓటీటీ యాప్ డౌన్ లోడ్ అవ‌స‌రం లేదు.పైన ఉన్న వెబ్ సైట్ ఓపెన్ చేసి టిక్కెట్ బుక్ చేసుకోవ‌చ్చు.

మ‌ల‌యాళంలో ఇంత‌గా ప‌బ్లిసిటీ.చేసిన లెస్బియ‌న్ సినిమా లేదు.

ఈ సినిమా కోసం ఎంతో మంది యువ‌కులు ఎదురు చూశారు.సినిమా చూశాక వాళ్లు ఎదురు చూసిన దానికి మించి ఉందంటూ చెప్పడం విశేషం.

ఈ చిత్రాన్ని 18 ఏళ్ల లోపు పిల్ల‌లు చూడ‌కూడదు.ఇంకా ఈ సినిమా పై కొంత మంది రాజ‌కీయం చేస్తున్నారు కానీ.

అలాంటి కాంట్ర‌వ‌ర్సీ చిత్ర‌మిది కాదు`` అన్నారు.ఈ చిత్రానికి డీఓపిః ఉన్ని మాధ‌వూర్‌; సంగీతంః రోన్ రాఫిల్ ; స్క్రీన్ ప్లేః పాల్ విక్‌లిఫ్‌; ఎడిటింగ్ః విపిన్ మానూర్; ద‌ర్శ‌కుడుః అశోక్ ఆరాన్‌, నిర్మాతః సందీప్ ఆర్‌.

నీతులు చెప్పడమే కాదు పాటించాలిగా.. అనంత్ శ్రీరామ్ ఓల్డ్ సాంగ్స్ లిరిక్స్ పై విమర్శలు?