రాజకీయ మౌన దీక్ష లో జగ్గారెడ్డి ! కాంగ్రెస్ లో టెన్షన్ ?

మొన్నటి వరకు చేరికలతో జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక్కో కీలక నేత బయటకు వెళ్లిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.ఇప్పటికే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి లేఖను పంపించారు.

 Congress Mla Jaggareddy Silent On Party Issues And Rajagopal Reddy Resignation D-TeluguStop.com

ఈ లేఖలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైన ,కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలపైనా ఆయన అనేక కామెంట్స్ చేశారు.ఈ వ్యవహారం ఇలా ఉంటే గత కొంతకాలంగా సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం కాంగ్రెస్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగానే వ్యవహరిస్తున్నారు.

ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ఉన్న విభేదాలతో పాటు, అనేక అంశాలపై జగ్గారెడ్డి బహిరంగంగానే ఫైర్ అవుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారుతారని, టీఆర్ఎస్ లో కానీ, బీజేపీ లో కానీ చేరుతారని ప్రచారం జరుగుతుండగానే ఆ వ్యాఖ్యలను ఆయన కొట్టు పారేస్తూ సైలెంట్ అయ్యారు.

జులై ఒకటో తేదీ నుంచి అక్టోబర్ 30 వరకు ఎటువంటి రాజకీయ ప్రకటనలు కానీ, ఎవరిపైనా కామెంట్స్ కానీ చేయనంటూ సైలెంట్ అయిపోయారు.

పూర్తిగా రాజకీయ మౌనం పాటిస్తున్నారు.

దీంతో జగ్గారెడ్డి ఏం చేయబోతున్నారనే టెన్షన్ కాంగ్రెస్ లో కనిపిస్తోంది.ఆయన మీడియా సమావేశాల్లోనూ రాజకీయ అంశాలపై స్పందించడం లేదు.

ఏదైనా నవంబర్ 5వ తేదీన గాంధీభవన్ లోనే మాట్లాడుతానని ,ఆరోజు మీడియా సమావేశం నిర్వహించి అన్ని విషయాలు చెబుతానంటూ జగ్గారెడ్డి చెబుతూ ఉండడంతో ఆయన ఏం చెబుతారు అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.అయితే జగ్గారెడ్డి రాజకీయ ప్రకటనలకు దూరమైనా, యాక్టివ్ గానే అన్ని కార్యక్రమాలలోనూ పాల్గొంటున్నారు.

సంగారెడ్డి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు.

Telugu Aicc, Congress, Jagga, Jagga Change, Jagga Silence, Komatirajagopal, Raja

అనేక ప్రజా సమస్యల విషయంలోనూ ఆందోళనలు చేపడుతూ ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.పూర్తిగా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.అలాగే నియోజకవర్గంలో పండుగలు, విందులు, వినోద కార్యక్రమాలకు హాజరవుతున్నారు.

రాజకీయంగా యాక్టివ్ గా ఉంటూ పార్టీ విషయాలపై మౌనం గా ఉండడంతో ఖచ్చితంగా జగ్గారెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది.ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆరాధిస్తున్నట్లు సమాచారం.

కీలక నేతలంతా ఇప్పుడు ఒక్కొక్కరుగా పార్టీ మారుతున్న నేపథ్యంలో జగ్గారెడ్డి కదలికల పైన కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube