నందమూరి తారకరామారావు కథానాయకుడుగా మాజీ ముఖ్యమంత్రిగా ప్రజా అభిమానుల హృదయాలలో చిరస్థాయిగా నిలుపుకున్నారు.ఎన్టీఆర్ నటనను వారసత్వంగా కొడుకుల దగ్గర నుండి మనోళ్ళ వరకు తాతకు తగ్గ మనవాళ్ళు అని పేరు పెంచుకుంటూ వచ్చారు.
వ్యక్తిగతంగా వారి వారికి ఎన్ని సమస్యలు ఉన్నా ఎటువంటి సినిమా ప్రమోషన్, కుటుంబ ఫంక్షన్స్ అయినా కుటుంబ సమేతంగా కలుసుకుంటారు నందమూరి కుటుంబం.అటువంటి కుటుంబంలో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది.
ఎన్టీఆర్ కి 12 మంది సంతానంలో నలుగురు కూతుళ్లున్న విషయం తెలిసిందే.సోమవారం నాలుగో కుమార్తె అయిన కంఠమనేని ఉమా మహేశ్వరి హఠాన్మరణం ఎన్టీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
అయితే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందనే వార్త వినిపిస్తుంది.కంఠమనేని ఉమా మహేశ్వరి అనారోగ్య సమస్యలతోనే ఆత్మహత్యకి పాల్పడిందని ఆమె కూతురు దీక్షిత మీడియాతో వెల్లడించిన విషయం తెలిసిందే.
గత కొంత కాలంగా ఆమె మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతుందని తెలిపారు.ఈ క్రమంలోనే ఆమె బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని వినికిడి వినిపిస్తుంది.

ఉమామహేశ్వరిని మొదట ఎన్టీఆర్.నరేంద్ర రాజన్ అనే వ్యక్తికిచ్చి వివాహం చేయగా.అనుకోని సంఘటనల ద్వారా విడిపోయారు.ఆ తర్వత ఆమెకి కంఠమనేని శ్రీనివాస్ ప్రసాద్‌తో రెండో వివాహం జరిగింది.వీరికి ఇద్దరు కూతుళ్లు వివాహం తర్వాత కూడా మానసికంగా, శారీరకంగా పలు సమస్యలను ఉమా మహేశ్వరి ఫేస్ చేసింది.గత జ్ఞాపకాలు మాత్రం ఆమెని నిత్యం వెంటాడేవని తెలుస్తుంది.
ఆ సమస్యతో మానసికంగా కృంగిపోయిందని, దీంతో అనేక అనారోగ్య సమస్యలు వచ్చాయని తెలుస్తుంది.ఏదేమైనాప్పటికీ గొప్ప కుటుంబంలో జన్మించిన ఉమామహేశ్వరి జీవితం ఇలాంటి దుర్భరంగా సాగడం, ఆమె జీవితంలో ఇంతటి కష్టాలు, కన్నీళ్లు, విషాద సంఘటలుండటం అత్యంత బాధాకరం.