సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లైగర్.ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుండగా.
పూరీ కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.ఈ సినిమాను ఆగస్టు 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా వరుస ప్రొమోషన్స్ చేస్తూ మరింత హైప్ పెంచేస్తుంది.పూరీ జగన్నాథ్ ఎప్పుడు లేని విధంగా భారీ ఖర్చుతో భారీ సెట్టింగ్స్ తో ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాడు.
ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చుస్తే ఈ విషయం ఆడియెన్స్ కు అర్ధం అయ్యింది.
ఈ సినిమాకు ముందు అనుకున్న దాని కంటే కరోనా కారణంగా మరింత బడ్జెట్ పెరగడంతో వీరు ఒక నిర్ణయం తీసుకున్నారట.
ఈ సినిమా నిర్మాణంలో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా భాగం అవ్వడంతో అక్కడ కూడా భారీ బిజినెస్ జరిగింది.కేవలం థియేట్రికల్ రైట్స్ కే వంద కోట్ల వరకు దక్కించుకుని అందరికి షాక్ ఇచ్చింది.

ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే పెట్టుబడి అంతా తిరిగి రావడంతో ఇక నుండి రాబోతున్న మొత్తంలో హీరో, డైరెక్టర్ వాటా తీసుకుంటారట.అలాగే మరో నిర్మాత కరణ్ అక్కడ బాలీవుడ్ లో వాటా తీసుకుంటాడట.ఈ విధంగా పెట్టుబడి మొత్తం వెనక్కి వచ్చిన తర్వాత లాభాల్లో వాటాను పారితోషికంగా తీసుకోవడం వల్ల బడ్జెట్ చాలా తగ్గింది అని ఈ విధానం ను అందరు పాటిస్తే ముందు ముందు మంచి జరుగుతుందని.నిర్మాతలు కూడా ఇబ్బందులు పడకుండా ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరి అందరు ఈ విధానము ఫాలో అవుతారో లేదో చూడాలి.