ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించాలనే తాపత్రయం చైనాకు రోజు రోజుకూ పెరిగిపోతుంది.ప్రస్తుతం ఆదే పాత్రను పోషిస్తున్న అమెరికా పై ఎప్పటికప్పుడు ఘాటైన విమర్శలు చేస్తూ తనదైన ప్రత్యేకతను ప్రదర్శిస్తుంది చైనా.
తాజాగా ఇరు దేశాల అధ్యక్షులు బైడన్- జింగ్ పింగ్ ల మధ్య జరిగిన ముఖా ముఖీ సమావేశంలో శాంతి చర్చలకు బదులు విమర్శనాస్తాలే సంధించుకున్నట్లు సమాచారం.కారణా లేవైనా, మొత్తం మీద ఆధిపత్య పోరే ఈ ఇద్దరిలోనూ స్పష్టంగా కనిపిస్తుంది.
అమెరికా-చైనా అధినేతల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయంటూ వచ్చిన వార్తలతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా అటువైపు దృష్టి సారించాయి.ఎప్సుడూ ఉప్పు, నిప్పులా ఉండే వాళ్లిద్దరి మద్యా, శాంతి చర్చలు ఏవిధంగా జరుగుతాయో అర్ధంగాకా, కొంత టెన్సన్ అలుముకుంది.
తీరా ఆ సమయం వచ్చిన తర్వాత యాధా రాజా .తధాప్రజాగా వారిద్దరి మధ్యా చర్చలు జరిగినట్లు సమాచారం.
ఈనెల 28 న బైడెన్-జిన్‌పింగ్ మధ్య సుమారు రెండున్నర గంటల సమావేశం లో అశాంతి చర్చలే జరిగినట్లు సమాచారం.వారిద్దరి సంభాషణలు ఓ స్థాయిలో నిప్పులు చెలరేగాయి.
దాంతో ఇరు దేశాల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.ఈ చర్చల్లో అంతరార్ధాన్ని కొంచెం సూక్ష్మంగా ఆలోచిస్తే.
తెరవెనుక అమెరికా ఏదో అనుమానిస్తోందనే అభిప్రాయాలు విశ్లేషకుల్లో వ్యక్తమవుతుంది.అందుకే ఇటీవల ఆ దేశం తీసుకున్న నిర్ణయాల్లో చాలా వరకూ చైనాపైన ఆగ్రహమే వ్యక్తమవుతుంది.

చర్చల్లో తాజా అంశాలను ప్రధానంగా పరిశీలిస్తే .! అమెరికా-చైనా అధ్యక్షుల చర్చల్లో తైవాన్ ప్రధానాంశంగా మారింది.త్వరలో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ,. తైపే లొ పర్యటించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి.అది దృష్టిలో పెట్టుకొని షీ జిన్‌పింగ్ ఏమనుకున్నారో తెలీదు గాని, పరుషమైన వ్యాఖ్యలు మాత్రం చేశారు.తైపేలో పర్యటించడమంటే ప్రజాభిప్రాయాన్ని ఉల్లంఘించినట్లే అని వ్యాఖ్యానించారు.
ఒక వేళ మీరు నిప్పుతో చెలగాటం ఆడితో అది మీకే కాలుతుందంటూ డైలాగులు పలికారు.అమెరికా ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నా అంటూ, బెదిరింపులకు దిగారు.
మరోవైపు “నిప్పుతో చెలగాటం.” అనే కామెంట్ చైనాకు సహజమైపోయింది.ఎదుటి వారిని ఈ డైలాగ్ తోనే బెదిరించేసి తనపని కానిచ్చేసుకోవాలనే కుయుక్తిని అగ్రరాజ్యం అమెరికానే కాదు, ఏదేశమైనా ఎందుకూరుకుంటుందనే అభిప్రాయాలు ముఖ్యంగా భారతీయల్లోనూ వినిపిస్తున్నాయి.ఈపదాన్ని వాడటం ముఖ్యంగా చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్‌కు ఇదే తొలిసారేం కాదు.గతంలో కూడా ఇలానే మాట్లాడారు.చైనాకు చెందిన దౌత్యవేత్తలు కూడా తైవాన్ విషయంలో ఇదే వాక్యాన్ని తరచూ వాడుతుంటారు.

మరోవైపు అమెరికా ఇంత కఠినంగా కాకపోయినా.తాను చెప్పాలనుకున్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది.తైవాన్ విషయంలో అమెరికా నిర్ణయం ఎప్పటికి మారబోదని అర్ధమైయ్యి, అర్ధం కానట్లు చెప్పారు బైడెన్. ఏకపక్షంగా ప్రస్తుత పరిస్థితిని మార్చే యత్నం చేస్తే, తైవాన్ జలసంధిలో శాంతి స్థిరత్వం కొరవడుతుందంటూ చిరునవ్వుతూనే హెచ్చరికలు జారీ చేసారు.
వీటితో పాటు వీరి మధ్య ఆర్థిక సహకారం, ఉక్రెయిన్ వంటి అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు విశ్వాసనీయ వర్గాల సమాచారం.
నాన్సీ పెలోసీ.
తైపేలో పర్యటిస్తారని కన్ఫర్మ అవ్వడంతో అమెరికా అప్రమత్తమైంది.చైనాతో చర్చలు ఏవిధంగా మారాతాయో అనే ఆలోచనతోనే అమెరికా కీలక నిర్ణయాలు తీసుకుంటుందనే విషయం అర్ధమవుతుంది.
మరో వైపు పెలోసీ అధికారికంగా ప్రకటన చేయకపోయినప్పటికీ.చైనా మాత్రం హెచ్చరికల మీద హెచ్చరికలు జారీ చేస్తోంది.
అమెరికా-చైనా మధ్య ఇది ప్రధాన వివాదంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నౌకల మోహరింపు పై చైనా గుర్రుగా ఉంది.మరోవైపు పెలోసీ పర్యటనను దృష్టిలో పెట్టుకొని అమెరికాకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ యూఎస్‌ఎస్ రోనాల్డ్ రీగన్, స్ట్రైక్ గ్రూప్‌ను, సింగపూర్ పోర్టు నుంచి దక్షిణ చైనా సముద్రంలోకి తరలించనట్లు అమెరికా నేవీ సెవన్త్ ఫ్లీట్ ధ్రువీకరించింది.చైనా ప్రభుత్వ గూఢచర్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని అమెరికా అధికారులు హెచ్చరిస్తున్నారు.
అణ్వాయుధాలకు సంబంధించిన కమ్యూనికేషన్లపై చైనా దృష్టిపెట్టినట్లు తెలుస్తుంది.
మరోవైపు సెమీ కండెక్టర్ల తయారీ స్థిరీకరించడంపై అమెరికా ప్రతినిధుల సభలో ఇరు పక్షాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి.
దీనిపై టెక్ సెక్టార్ పూర్తిగా స్వతంత్రంగా పనిచేసేలా పరిస్థితులను సమీకరించారు.ఈ ఉత్పత్తిని చైనా నిలిపేసినా, తైవాన్ నుంచి ఎగుమతులను అడ్డుకొన్నాఅమెరికా మాత్రం అన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికన్ వార్తా సంస్థలు విశ్లేషిస్తున్నాయి.
ప్రస్తుతం అమెరికా, చైనా ల మధ్య జరిగే అశాంతి చర్చలు ఏమేరకు, ఎప్పడు శాంతిగా మారతాయో అర్ధంగాక, ప్రపంచ దేశాల్లో టెన్షన్ ను మరింతగా పెంచుతున్నాయి.చైనా తయారీని నిలిపివేసినా, తైవాన్ ఎగమతులను అడ్డుకొన్నా ఇబ్బంది లేకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నారు.