హీరోల పారితోషికం విషయంలో నిర్మాతలు యూ టర్న్‌

టాలీవుడ్‌ లో నిర్మాతల కష్టాలు తీర్చేందుకు అన్నట్లుగా ఇటీవల బడ్జెట్‌ కట్టింగ్ విషయమై చర్చలు మొదలు అయ్యాయి.బడ్జెట్‌ తగ్గించాలి అనగానే చాలా మంది హీరోల పారితోషికాలు తగ్గించుకోవాలి అంటూ మొదలు పెట్టారు.

 Tollywood Producers U Turn About Heroes Remuneration Details, Ashwini Dutt, Band-TeluguStop.com

దాంతో ఇప్పటికే కొందరు హీరోలు పారితోషికాలు తగ్గించుకునేందుకు సరే అన్నట్లుగా వార్తలు వచ్చాయి.కాని ఈ విషయంలో కొందరు మాత్రం హీరోలకు మద్దతుగా నిలుస్తున్నారు.

ముఖ్యం గా నిర్మాత లు కొందరు హీరోలు పారితోషికం తగ్గించుకోవాల్సిన అవసరం లేదని.హీరో లతో తమ స్థాయి కి తగ్గట్లుగానే సినిమాలు నిర్మించాలి.

అలా కాదని సినిమాలను భారీ మొత్తం పెట్టి నిర్మించి ఆ తర్వాత ఇబ్బంది పడటం ఎందుకుం అంటున్నారు.

హీరో ల స్థాయి నిర్మాత లు సినిమా లను చేస్తే అప్పుడు అటు ఇటు ఫలితం తేడా కొట్టినా కూడా ఇబ్బంది లేదు అనేది కొందరి అభిప్రాయం.

మొత్తాని కి బడ్జెట్‌ తగ్గించుకోవచ్చు కాని సినిమా ల యొక్క హీరోల పారితోషికాలను తగ్గించడం అనేది అవివేకమైన చర్య అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.హీరోలను పారితోషికం తగ్గించుకోవాలన్న నిర్మాత లు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నట్లుగా అయ్యింది.

పారితోషికం విషయంలో హీరోలు వారికి పూర్తి స్వేచ్చ ఉంటుంది.

Telugu Ashwini Dutt, Bandla Ganesh, Heroes, Telugu, Tollywood-Movie

సినిమా స్తాయి.వారు ఇచ్చే డేట్లు.వారు పడే కష్టం ఆధారంగానే సినిమా కు వారు పారితోషికం తీసుకోవాలి.

ఆ విషయంలో వారిని ఏమనకూడదు అనేది బండ్ల గణేష్‌ అభిప్రాయం.తాజాగా అశ్వినీదత్‌ కూడా హీరోల పారితోషికాలు తగ్గించుకోవాలని అడగడం సరైనది కాదనే అభిప్రాయం ను వ్యక్తం చేశాడు.

మొత్తానికి హీరోల పారితోషికం ను తగ్గించుకోవాలి అంటూ వాదించిన నిర్మాతలు ఇప్పుడు నోరు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. హీరోల పారితోషికాలు మాత్రమే కాకుండా దర్శకుల పారితోషికాలు కూడా తగ్గాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube