వీఆర్ఏల జెఎసి ఆధ్వర్యంలో గత నాలుగు రోజుల నుండి ఖమ్మం అర్బన్ , రూరల్ మండలం తహశీల్దార్ కార్యాలయం ముందు చేస్తున్న దీక్షలకు మద్దతుగా బహుజన సమాజ్ పార్టీ మహిళా జిల్లా కన్వీనర్ , జోనల్ కన్వీనర్ వరకాల విజయకుమారి , జిల్లా నాయకుడు ఒగ్గు బాబురావు రిటైర్డ్ SI లు పలికి దీక్షా శిబిరంలో పాల్గొని మాట్లాడారు .తమ దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని , విఆర్ఎ లకు పే స్కేల్ జీవో వెంటనే విడుదల చేయాలని , వీఆర్ఎ లకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని , వారి యొక్క న్యాయబద్ధమైన కోరికలను తీర్చాలని డిమాండ్ చేశారు .
అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను నెరవేర్చకుండా సిఎం కెసిఆర్ గారు కాలయాపన చేస్తున్నారని , వీఆర్ఏలను చిన్నచూపు చూడడం మీకు తగదని అన్నారు .
అర్హత కలిగిన వీఆర్ఎలకు ప్రమోషన్లు కల్పించాలని , 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఎ వారసులకు ఉద్యోగాలు కల్పించాలని , ఉద్యోగ భద్రత కల్పించాలని , పెన్షన్ల సౌకర్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ డిమాండ్ల సాధన కోసం వీఆర్ఎలు సమ్మె చేస్తున్నట్లు తెలిపారు .ఈ డిమాండ్ల సాధనలో బహుజన బిడ్డలు వీఆర్ఏ ల తరుపున బహుజన సమాజ్ పార్టీ అండగా ఉండి పోరాడుతుంది అని స్పష్టం చేశారు .ఈ సందర్బంగా రూరల్ మండలం అధ్యక్షులు చాంద్ మియ , ప్రధాన కార్యదర్శి వీరయ్య , ట్రెజరర్ నాగరాజు , ఉపాధ్యక్షులు రామారావు , గాలి సువర్ణ , అర్బన్ మండల అధ్యక్షులు రాఘవరావు మరియు వీఆర్ఏలు మధురవాణి , ప్రసన్న , సుధా , ఖాజాబీ , దుర్గమ్మ , ఛార్లెస్ , రమేష్ లు మాట్లాడుతూ మా డిమాడ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిచాలని కోరారు .ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు విజయలక్ష్మి , ఉమారాణి , సుజాత , శ్రీదేవి , రాధికా , శ్రావణి , ఉపేంద్రమ్మ , కళావతి , సులోచనా, రజియా, జనార్దన్ , వినయ్ కుమార్ , కుక్కల రాములు తదితరులు పాల్గొన్నారు .