రష్మిక పొలిటికల్ ఎంట్రీ.. ఎంపీ కూడా అవుతుందా..?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస సినిమాలతో సూపర్ బిజీగా ఉంది.అలాంటి ఆమెకి పొలిటికల్ కెరియర్ కూడా ఉంటుందని అంటున్నారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి.

 Rashmika Will Enter Into Politics Venu Swamy Comments , Kannada,karnataka,politi-TeluguStop.com

రష్మిక పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందని అంతేకాదు ఎంపీ కూడా అవుతుందని అంటున్నారు వేణు స్వామి.సిని సెలబ్రిటీస్ కి సంబందించిన విషయాల గురించి ముందే జరగబోయేది ఇదే అని సంచలన వ్యాఖ్యలు చేసే వేణు స్వామి తాజా ఇంటర్వ్యూలో రష్మిక పొలిటికల్ కెరియర్ గురించి చెప్పుకొచ్చారు.

పార్టీ, ఆమె పోటీ చేసే ప్లేస్ తో సహా వేణు స్వామి చెప్పడంతో ఆడియెన్స్ షాక్ అవుతున్నారు.

ప్రస్తుతం సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న రష్మిక జాతకంలో పొలిటికల్ కెరియర్ కూడా ఉందని అంటున్నారు వేణు స్వామి.

ఆమె హైదరాబాద్ నివాసం లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారట.ఆ టైం లో రష్మిక జాతకం చూశానని ఆమె ఖచ్చితంగా రాజకీయాల్లోకి వెళ్తుందని.కాంగ్రెస్ పార్టీ తరపున కర్ణాటక రాష్ట్రం నుంచి లోక్ సభకి పోటీ చేస్తుందని అన్నారు.అంతకుముంచు నాగ చైతన్య, సమంత విడిపోతారని చెప్పడం.

ఆయన చెప్పినట్టే ఆ జంట విడిపోవడంతో వేణు స్వామి జాతకంపై సినీ సెలబ్రిటీస్ ప్రత్యేక దృష్టి పెట్టారు.

Telugu Kannada, Karnataka, Rashmika, Rashmika Ups, Tollywood, Venu Swamy-Movie

ఇక ఇప్పుడు రష్మిక పొలిటికల్ కెరియర్ పై కూడా ఆయన చేసిన కామెంట్స్ హాట్ న్యూస్ గా మారాయి.చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న రష్మిక రాజకీయాల్లోకి వెళ్లడం ఏంటని ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.మరి వేణు స్వామి చెప్పినట్టుగా రష్మిక పాలిటిక్స్ లోకి వెళ్తుందా లేదా అన్నది చూడాలి.

 రాజకీయాలు ఎలా ఉన్నా రష్మిక మాత్రం సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అక్కడ ఇక్కడ వరుస ప్రాజెక్ట్ లతో దుమ్ము దులిపేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube