ఆ సీనియర్ హీరోయిన్ చేసిన తప్పే బేబమ్మ చేస్తుందా.. తిప్పలు తప్పవా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ ఇచ్చిన మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

 Will Krithi Shetty Do The Same Mistake That Senior Heroine Did Details, Krithi S-TeluguStop.com

ఈ క్రమంలోనే అనంతరం శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు.ఇకపోతే ఈమె రామ్ హీరోగా తిరిగిన ది వారియర్ సినిమా ద్వారా ఏకంగా ద్విభాషా చిత్రంలో నటించారు.

ఇకపోతే ప్రస్తుతం ఈమె మరొక కోలీవుడ్ స్టార్ హీరో సినిమాతో బిజీగా ఉన్నారు.డైరెక్టర్ బాల దర్శకత్వంలో సీనియర్ హీరో సూర్య సరసన బేబమ్మ నటిస్తూ బిజీగా ఉంది.

ఈ క్రమంలోనే కొందరు ఈ విషయంపై స్పందిస్తూ కృతి శెట్టి ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ఇలా ఏకంగా స్టార్ హీరోల సరసన సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తప్పు చేస్తుందా? సూర్య సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తన కెరీర్ ను డేంజర్ లో పడేసుకుందా అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Telugu Aarti Aggarwal, Bala, Surya, Krithi Shetty, Krithishetty, Ram Warrior, Su

గతంలో కూడా సీనియర్ నటి ఆర్తి అగర్వాల్ సైతం ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లోనే ఇలా వరుస సినిమాలలో నటిస్తూ మంచి హిట్ కొట్టిన ఈమె అనంతరం ప్రేమ అంటూ తన సినీ కెరియర్ గురించి పూర్తిగా కాన్సన్ట్రేషన్ తగ్గించారు.ఈ క్రమంలోనే ఆమె ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయారు.ఇలా ఈమె బాటిలోని కృతి శెట్టి ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లోనే వరుస సినిమాలలో నటించడమే కాకుండా స్టార్ హీరోలతో జోడి కడుతోంది అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక హీరోతో ఈమె ప్రేమలో ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఇలా ఈ ప్రేమ వ్యవహారం వల్ల తన కెరీర్ కూడా ఇబ్బందులలో పడబోతుందా ఈమెకు కూడా అలాంటి తిప్పలు తప్పవా అంటూ పలువురు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube