అన్నార్తులకు అండగా నాట్స్ ఫుడ్ డ్రైవ్ ఫుడ్ బ్యాంక్‌కు నాట్స్ బోస్టన్ విభాగం విరాళం బోస్టన్: జులై 22: అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.అమెరికాలో నిరుపేదలకు కూడా సాయం చేసేందుకు నేనుసైతమంటూ ముందుకొచ్చింది.
నాట్స్ బోస్టన్ విభాగం తాజాగా అన్నార్తుల ఆకలితీర్చేందుకు ఫుడ్ డ్రైవ్ చేపట్టింది.నాట్స్ బోస్టన్ విభాగం సభ్యులు, తెలుగువారు ఈ ఫుడ్ డ్రైవ్‌లో పాల్గొని తమ వంతు సాయం చేశారు.
ఫుడ్ డ్రైవ్ ద్వారా దాదాపు 6 వేల డాలర్ల విలువైన ఆహారాన్ని నాట్స్ సేకరించింది.ఇలా వచ్చిన ఆహారాన్ని నిరుపేదల ఆకలితీర్చే వోర్సెస్టర్ కౌంటీ ఫుడ్ బ్యాంక్‌కి విరాళంగా అందించింది.
ఈ ఫుడ్ డ్రైవ్ నిర్వహణలో నాట్స్ బోస్టన్ విభాగ సభ్యులు శ్రీనివాస్ గొండి, శ్రీథర్ గోరంట్ల, కల్యాణ్ కాకి, శేషి రెడ్డి, పవన్ వేమూరి, సునీల్ కొల్లి, గౌతమ్ చుండూరు తదితరులు కీలక పాత్ర పోషించారు.నాట్స్ బోర్డు చైర్ వుమన్ అరుణ గంటి, నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు) నూతి, నాట్స్ నాయకులు తదితరులకు బోస్టన్ విభాగం నిర్వహించిన ఈ డ్రైవ్ ని ప్రత్యేకంగా అభినందిస్తూ, మరిన్ని నూతన సేవా కార్యక్రమాలతో ముందుకు రావాలని పిలుపునిస్తూ, తమ తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.