క్రెడిట్ కార్డు గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు.ఇప్పుడు ఎక్కువమంది దీనిని ఉపయోగిస్తున్నారు.
ఉద్యోగాలు చేసేవారితో పాటు బిజినెస్ చేసేవారితో పాటు బ్యాంకు వినియోగదారులు చాలామంది క్రెడిట్ కార్డ్ ను వినియోగిస్తున్నారు.ఇక క్రెడిట్ కార్డు వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో.
నష్టాలు కూడా అన్నే ఉన్నాయి.క్రిడెట్ కార్డుల ఈఎంఐలు కట్టలేక, వడ్డీలు కట్టలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి.
క్రిడెట్ కార్డులు జాగ్రత్తగా ఉపయోగించుకుంటే లాభం చేకూరుతుంది.
అలా కాకుండా ఎలా పడితే అలా ఉపయోగించుకుంటే అప్పులు తప్పవు.
క్రెడిట్ కార్డు మీద అనేక ఆఫర్లు ఉంటాయి.ఆ ఆఫర్లను ఉపయోగించుకుంటే లాభం చేకూరుతుంది.
అలా కాకుండా క్రెడిట్ కార్డు ఉంది కదా అని ఏది పడితే అది కొనుగోలు చేన్తే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోంది.అయితే చాలామంది క్రెడిట్ కార్డు మీద లోన్ కూడా తీసుకుంటూ ఉంటారు.
ఇలా క్రెడిట్ కార్డు మీద లోన్ తీసుకునే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.లేకపోతే చిక్కుల్లో పడటం ఖాయం.
క్రెడిట్ కార్డు లిమిట్ కు మంచి బ్యాంకులు లోన్లు ఇవ్వవు.క్రెడిట్ కార్డు మీద వడ్డీ కంటే లోన్ మీద విధించే వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది.
అందుకే చాలామంది క్రెడిట్ కార్డు మీద లోన్ తీసుకుంటూ ఉంటారు.

ఇక క్రెడిట్ కార్డు మీద లోన్ తీసుకున్నప్పుడు వెంటనే చెల్లించాలి.లేకపోతే ఇబ్బందుల్లో పడతారు.అలాగే సకాలంలో లోన్ చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపుతుంది.
క్రెడిట్ స్కోర్ తగ్గితే బ్యాంకులు లోన్ ఇవ్వవు.
క్రెడిట్ కార్డుపై తీసుకున్న లోన్ వాయిదాను సకాలంలో చెల్లించాలి.
లేకపోతే అది డిఫాల్ట్ గా పరగణించబతుతుంది.ఇక క్రెడిట్ కార్డులపై లోన్ కోసం ప్రాసెసింగ్ ఫీజు 1 నుంచి 1.5 శాతం వరకు ఉంటుంది.లోన్ పీరియడ్ ఎంత తీసుకోవాలో నిర్ణయించే ఆప్షన్ క్రెడిట్ కార్డ్ హోల్డ్ కు కొంతవరకు మాత్రమే ఉంటుంది.