చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.కానీ కొంతమంది మాత్రమే తన నటనతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటారు.
ఇలా ఇప్పుడు వరకు ఎంతోమంది తమ నటనతో సహజనటిగా గుర్తింపు సంపాదించుకున్న నటీమణులు ఉన్నారు.ఇక అలాంటి హీరోయిన్స్ ఎవరో చూద్దాం.
సుహాసిని :
తమిళ చిత్రాలతో ఆరంగేట్రం చేసినప్పటికీ తెలుగులో కూడా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది.ముఖ్యంగా క్రాంతికుమార్ తెరకెక్కించిన స్వాతి చిత్రంతో సుహాసిని తనలోని నటిని నిరూపించుకుని ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా దక్కించుకుంది.ఇక ప్రతీ పాత్రలో ఒదిగిపోయిన కొన్ని సహజ నటిగా ఒక ముద్రవేసుకుంది.
శోభన :
దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో అగ్రతారగా తన హవా నడిపించింది.కేవలం తెలుగులో మాత్రమే కాదు తమిళ కన్నడ భాషల్లో కూడా ఎన్నో చిత్రాలలో నటించింది.తన నటనతో మెప్పించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు.

జయసుధ :
14 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది.తక్కువ సమయంలోనే సహజనటిగా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది.లక్ష్మీదీపక్ దర్శకత్వంలో వచ్చిన పండంటి కాపురం అనే సినిమాతో జయసుధ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
భానుప్రియ :
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది భానుప్రియ. చిరంజీవి బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది.
ఆ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి నటిగా విజయవంతమైన ప్రస్థానం కొనసాగించింది.

రేవతి :
కళ్ళతోనే కోటి భావాలు పండించి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది రేవతి.అంకురం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి తన అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది.
సౌందర్య :
ఇప్పటికికూడా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ సౌందర్య. ఇక ఈమె ఎంత గొప్ప నటి అన్న విషయం చెప్పడానికి సౌందర్య చేసిన పాత్రలు చూస్తే సరిపోతుంది.

రాధిక :
చిరంజీవి లాంటి స్టార్ హీరోలకు బెస్ట్ జోడిగా పేరు సంపాదించుకుని సూపర్ హిట్ లను అందుకుంది రాధిక. ఇప్పటికి వైవిధ్యమైన పాత్రలలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది.
ఆమని :
జంబలకడిపంబ సినిమాలో నరేష్ సరసన హీరోయిన్గా నటించి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆమని ఆ తర్వాత సహజనటిగా ఎన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించింది.

స్నేహ :
ప్రియమైన నీకు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన స్నేహ శ్రీరామదాసు, సంక్రాంతి, రాధాగోపాలం లాంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది.ప్రతి పాత్రలో ఆమె చూపిన అభినయం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది.
నిత్యా మీనన్ :
అలా మొదలైంది సినిమాలో తన సినిమా ప్రయాణం మొదలు పెట్టిన నిత్య మీనన్ గ్లామర్ పాత్రలకు దూరంగా వైవిధ్యమైన పాత్రలకు దగ్గరగా దూసుకుపోతుంది.వీళ్లు మాత్రమే కాకుండా సాయిపల్లవి, విద్యాబాలన్, మధుప్రియ, ఐశ్వర్యారాయ్ లాంటి ఎంతో మంది తారలు తమ నటనతో సహజనటిగా గుర్తింపు సంపాదించుకున్నారూ.