ప్రముఖ సంస్థలైన Amazon, Uber కలిసి అమెజాన్ ప్రైమ్ మెంబర్ల కోసం ఎక్స్‌క్లూజివ్ ఆఫర్స్ తీసుకొచ్చాయి.క్యాబ్ బుకింగ్‌లపై ప్రైమ్ మెంబర్ల కోసం ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించాయి.
అమెజాన్, ఉబెర్ అసోసియేషన్‌లో భాగంగా ప్రైమ్ యూజర్లు క్యాబ్ సేవల్లో చాలా ఆఫర్లు, అప్‌గ్రేడ్ బెనిఫిట్స్‌ను పొందుతారు.అమెజాన్ ప్రైమ్ కస్టమర్లు నెలకు 3 రైడ్‌లకు రూ.60 వరకు అంటే 20% డిస్కౌంట్ అందుకుంటారు.అలానే UberGo ధరతో Uber ప్రీమియర్‌కు తమ రైడ్‌లను అప్‌గ్రేడ్ చేసుకొనే వీలుంది.
ఇక ఈ ఎక్స్‌క్లూజివ్ ఆఫర్స్ డిసెంబర్ 31, 2022 వరకు అందుబాటులో ఉండగలవు.ఈ సమయంలో ప్రైమ్ సబ్‌స్క్రైబర్లు UberGo ధరతో Uber Premierకు అప్‌గ్రేడ్ కూడా చేసుకోవచ్చు.
వారు నెలకు 3 రైడ్స్‌ను ఉబెర్‌గో ధరతో ఉబెర్‌ప్రీమియర్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.అదనంగా వారు ఉబెర్ఆటో, మోటో, రెంటల్స్, ఇంటర్‌సిటీపై నెలకు 3 ట్రిప్పులకు రూ.60 వరకు అంటే 20% డిస్కౌంట్ అందుకోవచ్చు.అంటే నెలలో 3 ట్రిప్పులలో ప్రతి రైడ్‌కు రూ.20 చొప్పున డిస్కౌంట్ పొందవచ్చని అర్ధం చేసుకోవాలి.
ఈ నేపథ్యంలో అమెజాన్ ఇండియా ప్రైమ్ అండ్ డెలివరీ ఎక్స్‌పీరియన్స్ డైరెక్టర్ అయినటువంటి అక్షయ్ సాహి మాట్లాడుతూ… “ఫ్రీ ఫాస్ట్ డెలివరీ, ఎక్స్‌క్లూజివ్ షాపింగ్, బ్లాక్‌బస్టర్ ఎంటర్‌టైన్‌మెంట్ లేదా యాడ్-ఫ్రీ మ్యూజిక్‌తో మా ప్రైమ్ మెంబర్లకు మంచి విలువను అందించడానికి అమెజాన్ ప్రైమ్ నిత్యం కృషి చేస్తోంది.
మేం ప్రైమ్ మెంబర్లకు ఎల్లప్పుడూ మెరుగైన సేవలనే అందిస్తాం.ఈ కొత్త అసోసియేషన్‌తో వారు ఉబెర్ క్యాబ్‌ల్లో మరింత సౌకర్యవంతమైన రైడ్స్ ఆస్వాదించవచ్చు.ఉబెర్ ప్రీమియర్‌కి ఉచిత రైడ్ అప్‌గ్రేడ్‌లు.ఉబెర్ రైడ్‌లపై 20% తగ్గింపు ఇప్పుడు ఈ ప్రైమ్ డేని మరింత ప్రత్యేకంగా చేస్తాయి.” చెప్పడం గమనార్హం.