యంగ్ హీరో నాని వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.కరోనా సమయంలోనే ఈయన నుండి వి మరియు టక్ జగదీష్ సినిమాలు వచ్చాయి.
ఆ రెండు కూడా ఓటీటీ ద్వారా విడుదల అయ్యాయి.కరోనా తర్వాత శ్యామ్ సింగ రాయ్ మరియు అంటే సుందరానికి సినిమా లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకుంటాయి అనుకుంటే కాస్త అటు ఇటుగా అయ్యాయి.శ్యామ్ సింగ రాయ్ టాక్ బాగానే ఉంది.
వసూళ్లు బాగానే ఉన్నాయి.కాని అంటే సుందరానికి సినిమా విషయంలో టాక్ పాజిటివ్ గా వచ్చినా వసూళ్ల విషయంలో నిరాశ తప్పలేదు.
అందుకే దసరా సినిమా కు బడ్జెట్ విషయంలో కోతలు పెట్టాలనే నిర్ణయానికి వచ్చారనే వార్తలు వస్తున్నాయి.సినిమా కు మొదట గా 40 కోట్ల బడ్జెట్ ను పెట్టబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.40 కోట్ల బడ్జెట్ ను 10 కోట్ల కు తగ్గించి 30 కోట్లు తగ్గించారనే వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం నాని యొక్క మార్కెట్ చాలా డల్ గా ఉంది.
అందుకే దసరా సినిమా బడ్జెట్ కోత జరిగిందనే ఆసక్తికర పుకార్లు వచ్చిన నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు ఈ సినిమా విషయమై క్లారిటీ ఇచ్చారు.నాని మార్కెట్.
దర్శకుడి స్టార్ డమ్ అని కాకుండా ఈ సినిమాకు కథకు అంత బడ్జెట్ అవసరం కనుక పెడుతున్నాం.సినిమా బడ్జెట్ తగ్గించినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదు అన్నట్లుగా క్లారిటీ ఇచ్చారు.
దసరా సినిమాను త్వరగా పూర్తి చేయాలని నాని ప్రయత్నాలు చేస్తున్నాడు.దసరా సినిమా తర్వాత తదుపరి సినిమాకు సంబంధించిన ప్రకటన చేస్తాను అన్నట్లుగా నాని ఎదురు చూస్తున్నాడు.
దసరా తర్వాత కూడా భారీ ఎత్తున సినిమాలు నాని నుండి వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.