ఆడిప్రిప్‌ను ప్రస్తుతం నీట్ ఔత్సాహికుల కోసం మాత్రమే పరిచయం చేశారు దీనిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జూవాలజీ కరిక్యులమ్ కూడా భాగంగా ఉంటుంది.దీనిని ప్రత్యేకంగా నిపుణులు తీర్చిదిద్దారు క్లాస్ 11–12 వ తరగతి విద్యార్ధులు ఈ ఆడియోబుక్‌ను వినియోగించుకోవడంతో పాటుగా తమ ప్రిపరేషన్‌కు అదనపు ఎడ్జ్‌ను జోడించగలరు హైదరాబాద్, 06 జూలై 2022 : విప్లవాత్మక సాంకేతికతలు మరియు ఆవిష్కరణలను జోడించడంలో తమ నైపుణ్యం నిలబెట్టుకోవడంతో పాటుగా అత్యుత్తమమైన వాటిని అందించాలనే తమ ప్రయత్నంలో భాగంగా భారతదేశంలో అగ్రగామి టెస్ట్ ప్రిపరేటరీ సేవల సంస్ధ ఆకాష్+బైజూస్ ఇప్పుడు ఆకాష్ ఆడిప్రిప్ (AudiPREP)ను పరిచయం చేసింది.భారతదేశంలో నీట్ అభ్యర్ధుల కోసం మొట్టమొదటి సమగ్రమైన ఆడియో బుక్ ఇది.
ఆకాష్ ఆడిప్రిప్ లో కీలకాంశాలు
1.తగిన రీతిలో సౌండ్ మాడ్యులేషన్‌తో పాటుగా స్పష్టమైన ఉచ్చారణ కలిగిన అత్యున్నత నాణ్యత కలిగిన ఆడియో కంటెంట్ ఉంది.దీనిని అత్యున్నత అర్హతలు కలిగిన నిష్ణాతులైన ఫ్యాకల్టీ నేతృత్వంలో తీర్చిదిద్దారు.
2.నీటీ–గ్రీటీ– బోధనాంశాల వారీగా గత సంవత్సరపు ప్రశ్నలు సంబంధిత అంశాలకు తగినట్లుగా వరుస క్రమంలో ఉంటాయి.
3.అతి సులభమైన పద్ధతిలో కాన్సెప్ట్‌లను మెమరైజ్ చేసుకునేందుకు శక్తివంతమైన నిమోనిక్స్
4.
డయాగ్రమ్స్, టేబుల్స్ మరియు ఫ్లో ఛార్ట్‌లను పూర్తి స్ధాయిలో అర్థం చేసుకునే రీతిలో సవివరణమైన వివరణ
5.అతి ముఖ్యమైన నీట్ కాన్సెప్ట్‌లను ఎస్‌సీఆర్‌ఈటీ సిలబస్‌కు ఆవల సైతం కవర్ చేస్తూ కంటెంట్ బిల్డర్
6.సెల్ఫ్ ఎస్సెస్‌మెంట్ కోసం ఇంటరాక్టివ్ క్విక్ క్విజ్జిస్
7.ప్రతి చాప్టర్ చివరలో వేగవంతంగా రీక్యాప్ చేసుకునేందుకు అవకాశం
8.
ఫార్ములా చార్ట్ – చాప్టర్‌లో పలు అతి ముఖ్యమైన ఫార్ములాలను గుర్తుంచుకునేలా ప్రతి అధ్యాయం ముగింపు వేళ ముఖ్యమైన సూత్రాల పునశ్చరణ
వినూత్నమైన వెబ్ మరియు యాప్ ఆధారిత ఆడియోబుక్ ఆకాష్ ఆడిప్రిప్.దీనిలో శాస్త్రీయంగా తీర్చిదిద్దిన స్టడీ మెటిరియల్స్ తో కూడిన పొడ్‌కాస్ట్స్ ఉంటాయి.
వీటిని నిపుణులు తీర్చిదిద్దారు.ఈ ఆడియోబుక్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలసీ కరిక్యులమ్‌కు సంబంధించి పూర్తి అంశాలు ఉంటాయి.
క్లాస్ 11, క్లాస్ 12 విద్యార్థులకు ఇవి పూర్తి ఉపయుక్తంగా ఉండటం చేత మెడికల్ ప్రవేశ పరీక్షను వారు సులభంగా అధిగమించగలరు.
డిజిటల్ పరివర్తనపై ఆధారపడి తీర్చిదిద్దిన ఆకాష్ ఆడిప్రిప్, సమర్థవంతమైన, ప్రభావవంతమైన అభ్యాసాన్ని మల్టీ సెన్సరీ అభ్యాస విధానంతో అందిస్తుంది.
ఆ ఆడియోబుక్ ద్వారా ఏ సమయంలో అయినా పాఠ్యాంశాలను మననం చేసుకోవచ్చు.ఇవి అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయి.ఈ ఆడియోబుక్‌లో ప్రత్యేకమైన ఫీచర్ కూడా ఉంది.దీనిని స్పేస్డ్ రిపిటీషన్ అంటారు.
విద్యార్ధులు అతి సులభంగా డ్రై సబ్జెక్ట్స్‌ను నేర్చుకోవడంతో పాటుగా గుర్తుంచుకోవడంలోనూ ఇది సహాయపడుతుంది.ఇది అత్యంత ప్రభావవంతమైన , సమర్థవంతమైన ఉపకరణంగా సమయం సద్వినియోగం చేసుకునేందుకు తోడ్పడుతుంది.
ఈ ఆడియోబుక్ కొన్ని ఉత్సాహపూరితమైన ఫీచర్లు అయినటువంటి అత్యున్నత స్థాయి ఆడియో కంటెంట్‌ను తగిన మాడ్యులేషన్, స్పష్టమైన ఉచ్చారణతో ఆకాష్ నిపుణులు తీర్చిదిద్దారు.అంతేకాదు, సబ్జెక్ట్‌ల వారీగా గత సంవత్సరపు ప్రశ్నావళిని సైతం నీటీ గ్రీటీ శీర్షికన అందిస్తారు.
ఇది అత్యంత శక్తివంతమైన జ్ఞాపకశక్తిని, విస్తృతస్ధాయిలో డయాగ్రమ్‌లను వివరించడం, టేబుల్స్, ఫ్లో చార్ట్‌ల వివరణ అందించడంతో పాటుగా విద్యార్ధులు బోధనాంశాలను మరింతగా జ్ఞప్తికి ఉంచుకోవడం కూడా పెంచుతుంది.
ఈ ఆడియోబుక్‌లో కంటెంట్ బిల్డర్ ఫీచర్ సైతం ఉంది.
ఇది సంబంధిత నీట్ కాన్సెప్ట్స్‌ను ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు ఆవల కవర్ చేస్తుంది.దీనిలో ఇంటరాక్టివ్ క్విజ్‌లు సైతం కలిగి ఉండటం వల్ల స్వీయ పరీక్షలో సైతం సహాయపడి ఆహ్లాదకరమైన రీతిలో సాధన చేయడంలో మరియు సిద్ధం చేయడంలో సైతం తోడ్పడుతుంది.
ప్రతి అధ్యాయం ముగింపు సమయంలో వేగవంతంగా పునఃశ్చరణ చేసుకునేందుకు మరియు అతి క్లిష్టమైన భావనలను ఆకర్షణీయంగా, సులభంగా అర్ధం చేసుకునేలా ముఖ్య సూత్రాలను సైతం అందిస్తుంది.
ఆడిప్రిప్ ఆవిష్కరణ సందర్భంగా ఆకాష్+బైజూస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆకాష్ చౌదరి మాట్లాడుతూ ‘‘ముందు చూపున్న సంస్ధగా మేము మా విద్యార్ధులే ముందు విధానంతో ముందుకు వెళ్తున్నాము.
మేము స్ధిరంగా సమ్మిళిత అభ్యాస వాతావరణంకు అవసరమైన సాంకేతికతలను తీసుకువస్తున్నాము.పరిశ్రమలో ఎన్నో విద్యాధోరణులకు మేము ఆద్యులుగా నిలిచాము.ఆడిప్రిప్ మరో విప్లవాత్మక ఉపకరణంగా ఉండటంతో పాటుగా నీట్ ఔత్సాహికులకు అదనపు ఎడ్జ్‌ను అందిస్తుంది.ఈ సమగ్రమైన ఆడియోబుక్స్ అత్యున్నత నాణ్యత కలిగిన స్టడీ మెటీరియల్స్‌ను అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తీర్చిదిద్దారు.
ఇవి మల్టీ సెన్సరీ లెర్నింగ్‌తో విద్యార్ధులను నిమగ్నం చేస్తాయి’’ అని అన్నారు.
ఆడిప్రిప్ అనేది పోర్టబల్ ఆడియోబుక్ పరిష్కారం.
ఇది సమయాన్ని అత్యుత్తమంగా సద్వినియోగం చేసుకుంటుంది.ఒకరు ఏ సమయంలో అయినా , ఎక్కడైనా వీటిని వినడంతో పాటుగా అభ్యసించవచ్చు.
ఈ సాధనం స్పేస్డ్ రిపిటీషన్‌ను కూడా సులభతరం చేస్తుంది.ఇది దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందని శాస్త్రీయంగా నిరూపించబడింది.
ఆడియో బుక్ ప్రింటెడ్ స్టడీ మెటీరియల్ ద్వారా విజువల్ సెన్స్‌ను ప్రేరేపిస్తోంది.ఆడియో రికార్డింగ్‌ల ద్వారా వినడం వల్ల మల్టీ సెన్సరీ లెర్నింగ్ సామర్ధ్యం సైతం వృద్ధి చేస్తుంది.
అదే సమయంలో మై అండర్‌లైనింగ్ కీ వర్డ్, రన్నింగ్ నోట్స్ తీసుకోవడం ద్వారా స్పర్శ భావాన్నీ రేకెత్తిస్తోంది.ఆడిప్రిప్ ఇప్పుడు ఆకాష్ +బైజూస్ క్లాస్ 11, 12 విద్యార్ధులకు మరీ ముఖ్యంగా నీట్ కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు పూర్తి ఉచితంగా లభిస్తుంది.