అందరి పరిస్థితి నయనతారల ఉండదు.. సీనియర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ నటి ఐశ్వర్య భాస్కరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె సీనియర్ హీరోయిన్ నటి లక్ష్మి కూతురన్న విషయం అందరికి తెలిసిందే.

 Senior Heroine Aishwarya Bhaskaran Sensational Comments About Nayanthara Details-TeluguStop.com

ఐశ్వర్య భాస్కరన్ కేవలం నటిగా మాత్రమే కాకుండా హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.దాదాపుగా 200 సినిమాలకు పైగా సహ నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య భాస్కర్.

ఈమె సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తూ ఉంటుంది.విభిన్న క్యారెక్టర్ లలో నటిస్తు ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్రని వేసుకుంది.

అయితే ఒకప్పుడు స్టార్లుగా రాణించి ఆ తరువాత కుప్పకూలిపోయిన వారు ఎంతో మంది ఉండగా అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ ఐశ్వర్య కూడా ఒకరు.ఒకప్పుడు స్టార్స్ సినిమాలో నటించిన ఈమె ఇప్పుడు పూట తిండి కోసం ఇంటి ఇంటికి తిరిగి సెల్స్ గర్ల్ గా మారిపోయింది.

ఈ విషయాని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది.ఇటీవల ఒక ఇంటర్వ్యుల్లో పాల్గొన్న ఐశ్వర్య తన జీవితంలో జరిగిన పలు విషయాల గురించి చెప్పుకొచ్చింది.మొదట్లో హీరోయిన్‌ గా నటించిన ఆ తరువాత అవకాశాలు రాకపోవడంతో సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ మెప్పించింది.

కేవలం వెండితెర పైనే కాకుండా బుల్లితెర పై కూడా పలు టీవీ సీరియల్స్‌లో నటించింది తన నటనతో అలరించింది.

Telugu Actress Lakshmi, Nayanatara, Senior, Tollywood-Movie

ఇకపోతే ప్రస్తుతం తనకు పని లేదని డబ్బు కూడా లేదని,ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పనిచేయడానికైనా తాను ఆలోచించను అని చెప్పుకొచ్చింది ఐశ్వర్య.మంచి జీతం ఇస్తానంటే పాచిపని కూడా చేసేందుకు సిద్ధం అని అందరి జివితాలల్లో సినీ ప్రపంచం ఆనందాని నింపదు.హీరోయిన్‌గా అందరికి సెకండ్ ఇన్నింగ్స్ నయనతారలా ఉండదు.ప్రజెంట్ వీధుల్లో సబ్బులు అమ్ముతూ బతుకుతున్నాను.అప్పులు, ఇతర సమస్యలు అన్నీ తీరిపోయి ఆ బరువు తగ్గిపోవడంతో ఆనందంగా ఉన్నాను నా కాళ్లపై తాను నిలబడి స్వశక్తితో జీవిస్తున్నానని చెప్పుకొచ్చింది ఐశ్వర్య భాస్కరన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube