సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలునిర్వహించడానికి కార్మిక సంఘాలు పట్టుబట్టడంతో యజమాన్యం సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించడానికి సానుకూలంగా స్పందించింది .సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు పోటాపోటీగా కొనసాగనుంది.
తెలంగాణరాష్ట్రంలో సింగరేణి సంస్థ ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్నది .మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో సింగరేణి సంస్థ విస్తరించి ఉంది .సింగరేణి సంస్థ లో ప్రస్తుతం 42 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు .త్వరలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించే ఈ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు అన్ని పార్టీలు రంగంలోకి దిగి తమ అనుబంధ కార్మిక సంఘాలను గెలిపించు కొనుటకుశక్తివంచన లేకుండా కృషి చేసే అవకాశాలున్నాయి.
సింగరేణి సంస్థలోచివరిసారిగా గుర్తింపు సంఘం ఎన్నికలు 2017 లో నిర్వహించారు.ఆ గుర్తింపు సంఘం ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధ కార్మిక సంఘమైన టీబీజీకేఎస్ విజయం సాధించింది.
రెండు సంవత్సరాల కాలపరిమితి గెలిచిన టీబీజీకేఎస్2019 అక్టోబర్ 4 తో కాలపరిమితిముగిసినప్పటికీ అనధికారికంగా మరో రెండు సంవత్సరాలు గుర్తింపు సంఘం హోదాలో కొనసాగింది .సింగరేణి సంస్థ మాత్రంకరోనా నేపథ్యంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు సాధ్యం కాలేదని చెబుతున్న నేపథ్యంలో కార్మిక సంఘాల ఒత్తిడి మేరకుఎట్టకేలకుసింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలునిర్వహించడానికి సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి లేఖ రాసింది .ఈ మేరకు సింగరేణి సంస్థ నిర్వహించేగుర్తింపు సంఘం ఎన్నికలనురాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ అనుబంధ యూనియన్లనుగెలిపించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తాయి.ఇప్పటివరకు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలలో మూడు కార్మిక సంఘాలు మాత్రమే గుర్తింపు సంఘంహోదాదక్కించుకున్నాయి .సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ఫలితాలు అసెంబ్లీ ఎన్నికలపై పడతాయని రాజకీయ పార్టీలు గెలుపు కోసం ఇప్పటి నుండే కార్మికులనుప్రసన్నం చేసుకుంటున్నాయి.1998 లో సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రారంభమైనవి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగరేణిలో మాటిమాటికిసమ్మేలనునిరోధించడానికిగుర్తింపు సంఘం ఎన్నికలకు శ్రీకారం చుట్టాడు .