ఏపీలో ఎన్నికలకు రెండేళ్లు సమయం ఉన్నా ఇప్పటినుంచే పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు.అన్ని పార్టీలు గెలుపుపై లెక్కలు వేసుకుంటున్నారు.ఇప్పటికే పర్యటనలు పాదయాత్రలంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు.ఇక ఏపీలో ప్రధానంగా పొత్తులపై భారీ చర్చ జరుగుతోంది. వైసీపీ ఒంటరిగానే సొంత వ్యూహ రచనలతో ముందుకెళ్తోంది.అయితే నిన్నమొన్నిటి వరకు టీడీపీ వైసీపీకి మరోసారి అధికారం దక్కకుండా ఎలాగైనా ఓడించాలని అన్ని పార్టీలను కలుపుకొని పోవడానికి ఆసక్తి చూపించింది.
బహిరంగంగానే స్వాగతించింది.జనసేన, లెఫ్ట్ పార్టీలు కలిసి వస్తాయని అందరూ అనుకున్నారు.
అయితే పొత్తులపై ఎలాంటి క్లారిటీ ఎవరూ ఇవ్వలేదు.అయితే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ జనసేనతో పొత్తు ఉంటుందని పదే పదే చెప్పినప్పటికీ జనసేన క్లారిటీ ఇవ్వలేదు.
అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఇటీవల ఏపీ పర్యటనలో భాగంగా జనసేన టచ్ లో ఉందని చెప్పాడు.
ఈ నేపథ్యంలో టీడీపీ కూడా తన పంథాను మార్చుకుంది.
తామంతట తాము పొత్తులకు రావాలని కోరితే త్యాగాలు తప్పవని.ఇది పార్టీలో సీనియర్లకు కూడా మింగుడు పడకపోవడంతో డెసిషన్ మార్చుకున్నారు.
చరిత్ర కలిగిన పార్టీ.అపర చాణక్యుడు చంద్రబాబు అనుభవం ఇవి చాలదా ప్రజల్లోకి వెళ్లడానికి తోడు ఎందుకు.
అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.దాదాపు ఒంటరి పోరుకే సిద్దం అవుదామని ఫిక్స్ అయినట్లు సమాచారం.
కాకపోతే తమతో కలిసి పనిచేయడానికి ఏ పార్టీ ముందుకు వచ్చినా ఓకే అన్నట్లు సిగ్నల్స్ ఇస్తోంది.
అందుకే ఏపీలో తెలుగు తమ్ముళ్లు జోరుపెంచారు.అధికర పార్టీపై ఉన్న వ్యతిరేకతను క్యాచ్ చేసుకుని ప్రజల్లోకి వెళ్దామని డిసైడ్ అయ్యారు.వైసీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలకు ఆల్టర్నెటివ్ గా కనిపించే పార్టీ కేవలం టీడీపీ మాత్రమేనని అందుకే ప్రజలు తమవైపే ఉంటారని అంచనా వేస్తున్నారు.
పొత్తులుంటే భారీ మెజార్టీలు రావచ్చు.కానీ.సింగిల్ గా పోటీ చేసినా గెలుపు ఖాయం అని అనుకుంటున్నారు.అంతే గానీ పొత్తుల పేరుతో తాము త్యాగాలు చేయడానికి సిద్దంగా లేమని అంటున్నారు.
ఏపీలోని ఉమ్మడి జిల్లాలలో ఎప్పటికపుడు సర్వేలు చేయిస్తున్న టీడీపీ పొత్తులతో.సింగిల్ గా పోటీ చేసినా రిజల్ట్ ఎలా ఉంటుందో ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.
సింగిల్ గా పోటీ చేసినా మెజార్టీ సీట్లకంటే కూడా ఎక్కువగానే వస్తాయని లెక్కలేసుకుటున్నారు.ఇక ఈ నిర్ణయం టీడీపీకి ఎంతవరకు మేలు చేస్తుందో వేచి చూడాల్సిందే.