సింగపూర్‌లో దొంగతనం, వృద్ధుడిని మోసం చేసిన కేసులో భారత సంతతికి చెందిన నర్సింగ్ హోమ్ ఉద్యోగికి కోర్ట్ 4,000 సింగపూర్ డాలర్ల జరిమానా విధించింది.నిందితురాలిని లతా నారాయణన్ (59)గా గుర్తించారు.
ఒక వృద్ధుడి బాగోగులు చూసుకునేందుకు కేర్ టేకర్‌గా ఆమెను నియమించారు.దీనిని అదనుగా చేసుకున్న లతా నారాయణన్ వృద్ధురాలి ఏటీఎం కార్డును దొంగిలించి.1000 సింగపూర్ డాలర్ల నగదును విత్‌డ్రా చేసింది.అంతేకాదు సూపర్ మార్కెట్‌లో షాపింగ్ చేసేందుకు సైతం ఈ ఏటీఎం కార్డును ఉపయోగించింది.
ది స్ట్రెయిట్స్ టైమ్స్ కథనం ప్రకారం.విచారణ సమయంలో లతపై ఇలాంటి మరో రెండు ఆరోపణలను కోర్టు పరిగణనలోనికి తీసుకుంది.2019లో వుడ్‌ల్యాండ్స్ కేర్ హోమ్‌లో హెల్త్ అసిస్టెంట్‌గా వున్న లతను 65 ఏళ్ల వృద్ధుడిని చూసుకోవడానికి నియమించారు.కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం.వృద్ధుడు 2021లో మృతిచెందాడు.2019లో మృతుడు తన ఏటీఎం పిన్ మరచిపోవడంతో కొత్త కోడ్‌ని తీసుకునేందుకు లతను వెంటబెట్టుకుని బ్యాంక్‌కి వెళ్లాడు.
లత పక్కనే వుండగానే ఆ వృద్ధుడు తన కొత్త పిన్ నెంబర్‌ను బ్యాంక్ నుంచి తీసుకున్నాడు.అనంతరం ఏటీఎం కార్డ్‌ని తన ఫోన్ కవర్‌లో దాచుకున్నాడు.ఆ తర్వాత దానిని జాగ్రత్త చేయమని చెప్పి లతా నారాయణన్‌కు ఆయన అప్పగించాడు.అయితే నవంబర్ 21, 2019న లత తనకు ఆయన ఇచ్చిన ఏటీఎం కార్డు ద్వారా 1,000 సింగపూర్ డాలర్ల నగదును విత్ డ్రా చేసింది.
అదే నెల 25న వుడ్‌ల్యాండ్స్‌లోని ఒక సూపర్ మార్కెట్‌లో 73 సింగపూర్ డాలర్ల విలువ చేసే ఆహారం, ఇతర వస్తువులను కొనుగోలు చేసేందుకు కార్డును ఉపయోగించింది.
అయితే నవంబర్ 27న తన ఏటీఎం కార్డ్ పోయిందని.
తన బ్యాంక్ ఖాతా నుంచి ఎవరో నగదు విత్ డ్రా చేస్తున్నారని వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లత నేరాలు వెలుగులోకి వచ్చాయి.కాగా.నిందితురాలికి గతంలో నేర చరిత్ర వున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.2017లో కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం.కొన్ని దొంగతనాలను సంబంధించి 600 సింగపూర్ డాలర్ల జరిమానాను ఎదుర్కొంది.తాజా కేసులో 4,000 సింగపూర్ డాలర్ల జరిమానా విధించాలని ప్రాసిక్యూషన్ న్యాయమూర్తిని కోరింది.అయితే తాను దొంగతనం చేసిన 1,870 సింగపూర్ డాలర్ల మొత్తాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 9న సింగపూర్ క్యాన్సర్ సొసైటీకి విరాళం రూపంలో తిరిగి చెల్లించినట్లు ఆమె పేర్కొంది.అయితే సింగపూర్ చట్టాల ప్రకారం.
దొంగతనం, మోసానికి పాల్పడితే జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు.