తెలంగాణ విషయంలో పార్టీ కేంద్ర నాయకులు, ప్రధాని మోడీ ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో చెప్పడానికే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారని చెబుతున్నారు.జులై 2, 3 తేదీల్లో జరిగే జాతీయ కార్యవర్గ భేటీలో ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, మొత్తం కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు.
రెండు రోజుల పాటు కేంద్ర ప్రభుత్వమంతా హైదరాబాద్ లోనే మకాం వేయనుంది.రాష్ట్రంలోని పార్టీ శ్రేణల్లో పూర్తి స్తాయిలో కదలిక తీసుకువచ్చి…ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సన్నద్ధం చేయడానికే అన్నట్లుగా బీజేపీ సర్వ సన్నాహాలు చేస్తోంది.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది.
HICC వేదికగా జులై 2, 3, 4న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు.
అయితే ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఇంకా బీజేపీ ముఖ్యనేతలు తెలంగాణ పార్టీ నేతల్లో మరింత జోష్ పెంచెందుకు ప్రత్యేక దృష్టి పెంటానుంది.కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు పాల్గొనున్నారు.
గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలు అంశంపై సమీక్షించనున్నారు.వివిధ అంశాలపై కమలనాథులు తీర్మానం చేయనున్నారు.
వివిధ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపైనా చర్చించనున్నారు.ఈ సమావేశాలకు సంబంధించి హైదరాబాద్కు బీజేపీ సంస్థాగత సహకార్యదర్శి శివప్రకాశ్ , బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ వచ్చారు.
జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లను నేతలు పరిశీలించారు.రాష్ట్రంలో పార్టీ పటిష్టత గురించి దిశా నిర్దేశం చేశారు.ఎన్నికలు ఎప్పుడు జరిగినా 80 నుంచి 90 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వస్తామని ప్రధాని కార్పొరేటర్లతో చెప్పినట్లు సమాచారం.ఇప్పటికే రెండు దశల ప్రజా సంగ్రామ యాత్ర పూర్తి చేసిన బండి సంజయ్ ఈ నెలలో మూడో దశ యాత్ర ప్రారంభించాల్సి ఉంది.
అయితే వచ్చే నెలారంభంలో పార్టీ జాతీయ సమావేశాలు ఉండటంతో కొద్ది రోజుల పాటు వాయిదా వేసుకున్నారు.