అధికార బలంతో టిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులతో వేధిస్తున్నారు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి

అధికార బలంతో టిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులతో వేధిస్తున్నారని మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

 Former Pcc Chief Uttam Kumar Reddy Fires On Trs Leaders Details, Former Pcc Chie-TeluguStop.com

రాష్ట్రంలోనే అత్యధికంగా హుజూర్ నగర్ నియోజక వర్గంలో భూ అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు.సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలోని పలు గ్రామాల్లో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి రచ్చబండ రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్నారు.

రచ్చబండ కార్యక్రమానికి హాజరైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గీతారెడ్డి లకు కార్యకర్తలు భారీ స్వాగతం పలికారు.

తమ ప్రసంగాలతో నేతలు కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా టిఆర్ఎస్ నేతలు దళితుల భూములను ఆక్రమిస్తూ అటవీ భూములను కూడా మాయం చేస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు.టిఆర్ఎస్ నేతలు అధికార బలంతో కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు.

రానున్న రోజుల్లో టిఆర్ఎస్ నేతలకు గుణపాఠం తప్పదని అన్నారు.రైతే రాజు అన్న నినాదాన్ని కాంగ్రెస్ భుజాన వేసుకుని ప్రజల్లోకి తీసుకెళ్తుందని ఏదేమైనా ఏక కాలంలో రుణ మాఫీ చేసి తీరుతామని ఈ విషయంలో వెనుకడుగేసే ప్రసక్తే లేదన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube