రెంట్ ఇంటి కోసం వెతుకుతున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించండి!

చదువుకునేవారు, ఉద్యోగం, వ్యాపారం చేసేవారు జీవనోపాధి కోసం సిటీకి వెళ్ళినవారు….ఇలా ఎంతోమంది ప్రజలు అద్దె ఇంటిలోనే నివసిస్తుంటారు.

 Looking For A Rental House But These Tips Must Be Followed Rent House, Tips ,-TeluguStop.com

అయితే అద్దె ఇల్లు తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.సిటీకి ఎక్కడో దూర ప్రాంతంలో తక్కువ ధరకే మంచి ఇల్లు దొరికింది కదా అని దానిని రెంటుకు తీసుకోకూడదు.

ఇల్లు పెద్దగా ఉండటంతో పాటు అది ఆఫీసు, కాలేజీ వంటి ప్రదేశాలకు దగ్గరగా ఉండేలా చూసుకోవాలి.లేదంటే మీరు రెంట్‌ ఇంట్లో ఉన్నన్ని రోజులు దూర భారాలు, వ్యయప్రయాసలు తప్పవు.

ఇంటితో పాటు ఇంటిలో ఉన్న వెంటిలేటెడ్ కిటికీలు, బాల్కనీ, టెర్రేస్, వాటర్ ఫెసిలిటీ ఉండేలా చూసుకోవాలి.అన్ని నిత్యావసరాలు వెంటనే దొరికేలా కొంచెం సిటీకి దగ్గరలో ఇల్లు తీసుకోవాలి.

అలాగే రెంట్ డిక్లరేషన్ నిబంధనలు తెలుసుకోవాలి.నిబంధనలు తెలుసుకోకపోతే మీరు స్వేచ్ఛగా ఇంట్లో ఉండలేరు.ప్రతి రూల్ గురించి క్షుణ్ణంగా తెలుసుకుని మీకు నచ్చితేనే ఇంటిని అద్దెకు తీసుకోవాలి.కొందరు రాత్రిళ్లు బయటకి వెళ్ళనివ్వరు.

గట్టిగా మాట్లాడిన కూడా వారి దృష్టిలో తప్పు చేసినట్లే.అందుకే ఇలాంటి విషయాలన్నీ ముందుగానే తెలుసుకోవాలి.

అంతేకాకుండా, మీ రెంట్ హక్కుల గురించి ముందుగానే తెలుసుకుంటే మంచిది.అలాగే కరెంటు మీటర్ తనిఖీ చేసుకోవాలి.

విద్యుత్ మీటర్ రీడింగ్‌ను నమోదు చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి తగువులు రావు.ఇంట్లో ఏదైనా ఫర్నిచర్ పగిలి ఉందో లేదో ముందుగానే గుర్తించాలి.

లేదంటే మీరే వాటిని పగలగొట్టారని యజమానులు మీ నుంచి డబ్బులు వసూలు చేయొచ్చు.ఈ జాగ్రత్తలన్నీ పాటించిన తర్వాతే ఏదైనా ఇంట్లో అద్దెకి దిగాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube