చేరికలపై బీజేపీ ఫోకస్ ? చేరబోయే వారు వీరే .. ?

తెలంగాణ లో సార్వత్రిక ఎన్నికలు సమయం దగ్గర పడే కొద్దీ బిజెపి మరింత స్పీడ్ పెంచింది.గతంతో పోలిస్తే ఉత్తర తెలంగాణాలో బీజేపీ బలం బాగా పెరిగింది.

 Telangana Bjp Focused On Joining The Party Bjp, Central Bjp Leaders, Trs, Trs Go-TeluguStop.com

  నాయకులు యాక్టిివ్ అయ్యారు.కొత్తగా చేరిన నేతలతో పాటు,  మరికొందరు చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం రెండుసార్లు అధికారంలోకి రావడంతో సహజంగా ఏర్పడిన ప్రజావ్యతిరేకత ఇవన్నీ తమకు కలిసి వస్తాయని,  అలాగే కాంగ్రెస్ తెలంగాణలో బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్న, ఆ పార్టీ నాయకుల మధ్య ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం లేక పోవడం , గ్రూపు రాజకీయాలతో నిత్యం వివాదాల్లో మునిగితేలుతూ ఉండడంతో తమకు అధికారం దక్కడం పెద్ద కష్టమేమీ కాదు అన్న అభిప్రాయంలో తెలంగాణ బిజెపి ఉంది.దీనికి తోడు కేంద్ర బిజెపి పెద్దలు తెలంగాణ బిజెపి బలపడే విధంగా సహకారం అందిస్తుండటం వంటివన్నీ కలిసి వస్తున్నాయి.

       ఈ నేపథ్యంలో తెలంగాణలో బలహీనంగా ఉన్న జిల్లాల పై బిజెపి దృష్టిసారించింది.ప్రస్తుతం బిజెపి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బలోపేతం అవుతోంది.కానీ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పార్టీ బలహీనంగా ఉండడంతో అక్కడ బలం పెంచుకునే విషయంపై ప్రస్తుతం దృష్టి పెట్టారు.అది సాధ్యం అవాలంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున చేరికలు ఉండాలని గ్రహించారు.

దీంతో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యం దక్కక అసంతృప్తితో ఉన్న నాయకులపై బిజెపి కన్నేసింది.త్వరలోనే భారీ ఎత్తున చేరికలు  ఉండబోతున్నాయట.

తెలంగాణ బిజెపి బలపడే విధంగా నాయకులు ప్రయత్నిస్తున్నారు .ప్రస్తుతం బీజేపీ లోకి వెళ్ళలా లేక కాంగ్రెస్ లో కి వెళ్ళాలా అనే విషయంలో డైలమాలో ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి బిజెపిలో చేరే విధంగా ఒప్పించినట్లు సమాచారం.
   

Telugu Bandi Sanjay, Central Bjp, Komatirajagopal, Kondavisweswara, Trs-Politics

   అలాగే కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీ తో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తుండటంతో,  ఆయనను బిజెపిలో చేరేలా మంతనాలు చేస్తున్నట్టు సమాచారం.ఇక ఖమ్మం జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి చాలా కాలంగా టిఆర్ఎస్ సరైన ప్రాధాన్యం దక్కడం లేదు.దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.దీంతో ఆయన బిజెపిలో చేరే విధంగా  ఒప్పించేందుకు ఇప్పటికే పలుమార్లు బీజేపీ నేతలు చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది.ఇక తెలంగాణలో ప్రముఖ పారిశ్రామికవేత్త గా… కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న మైహోం రాజేశ్వరరావు ను బిజెపిలో చేర్చుకుని ఆయనను వేరే రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపించాలని చూస్తున్నారట.టిఆర్ఎస్ కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించి ప్రస్తుతం సైలెంట్ గా ఉంటున్న మాజీ ఎమ్మెల్యేలు,  మాజీ మంత్రులు, నాయకులు చాలా మందితో బిజెపి నేతలు సంప్రదింపులు చేసినట్లు సమాచారం.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube