మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.తాజాగా ఈయన నటించిన RRR చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు పొందారు.
ఈ క్రమంలోనే ఈయన పాన్ ఇండియా హీరోగా ఎంతో క్రేజ్ ఏర్పరుచుకున్నారు.ఇకపై ఈయన నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్నాయి.
ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన ఆచార్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కొంది.ఇక ఈ సినిమాలు విడుదల కావడంతో రామ్ చరణ్ తన తదుపరి సినిమా పై పూర్తి దృష్టిసారించాడు.ఈ క్రమంలోనే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో పాన్ ఇండియా స్థాయిలో ఓ సినిమా తెరకెక్కుతోంది.
ఈ సినిమా RC 15 అనే టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటుంది.
ప్రస్తుతం ఈ సినిమా వైజాగ్ లో చిత్రీకరణ జరుపుకుంటూ ఉండగా రామ్ చరణ్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందులో రామ్ చరణ్ స్వయంగా శివుడి సేవలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.తానే స్వయంగా శివుడికి అభిషేకాలు నిర్వహిస్తూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియో చూసిన అభిమానులు స్టార్ హీరో అయినప్పటికీ సింప్లిసిటీ కి నిదర్శనం అంటూ ఈయన సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.