తెలుగు లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో చివరి దశకు చేరుకుంది.అయితే ఇప్పటికే పలువురు సెలబ్రెటీలను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించినా బిగ్ బాస్ తాజాగా హౌస్ లోని ఆటను మరింత రంజుగా మార్చడానికి రంగమ్మత్త అలియాస్ యాంకర్ అనసూయ రంగంలోకి దిగింది.
అయితే అనసూయ ఎంట్రీ ఇవ్వడంతోనే అనసూయ అనే పాటకు స్టెప్పులను ఇరగదీసింది.అనసూయ తో పాటుగా హౌస్ లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ ఆ పాటకు స్టెప్పులు వేశారు.
ఆ తరువాత నటరాజ్ మాస్టర్ లేడీ గెటప్ వేసుకుని వచ్చి డ్యాన్సు ఇరగదీసాడు.
ఇక నట్రాజ్ మాస్టర్ చుట్టూచేరి బాబా భాస్కర్, యాంకర్ శివ లు కూడా చిందులు వేశారు.
బాబా భాస్కర్ అయితే నట్రాజ్ మాస్టర్ ని ఎత్తుకొని డాన్స్ వేసాడు.ఆ తరువాత అనసూయ హౌస్ లో ఉన్న ఒక్కొక్క కంటెస్టెంట్ కి వాచిపోయే విధంగా ప్రశ్నలు వేసింది.
ఇక అనసూయ అడిగిన ప్రశ్నలకు కంటెస్టెంట్ లకు చెమటలు కూడా పట్టాయి.మొత్తానికి యాంకర్ అనసూయ రావడంతో బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ కాస్త మరింత రెట్టింపు అయ్యింది.
అంతేకాకుండా ఎలా అయినా టాప్ ఫైవ్ లో నిలవాలి అనుకుంటున్న కంటెస్టెంట్ లకు కూడా కాస్త ఎంటర్టైన్మెంట్ ను అందించినట్లు అయింది.
ఇకపోతే బిగ్ బాస్ నాన్ స్టాప్ షో చూస్తుండగానే అప్పుడే ముగింపు దశకు చేరుకుంది.ఇక హౌస్ లో కంటెస్టెంట్ ల మధ్య నువ్వా నేనా అన్న విధంగా పోటీ జరుగుతోంది.కంటెస్టెంట్ లు కూడా ఎలా అయినా టాప్ ఫైవ్ లో నిలవాలి అని టాస్క్ లు ఆడుతున్నారు.
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో బిందు మాధవి, అఖిల్, అరియానా, శివ, నట్రాజ్ మాస్టర్, అనిల్ ఉన్న విషయం తెలిసిందే.