దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో లవర్ బాయ్ గా పేరు సంపాదించుకున్న నటుడు సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే ఈ మధ్య కాలంలో ఈయన సినిమాలలో నటించడం కన్నా ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.
తెలుగులో బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న సిద్ధార్థ్ అనంతరం ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకాదరణ పొంద లేకపోయాయి.ఈ క్రమంలోనే చాలా సంవత్సరాల తర్వాత మహాసముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమాని కూడా ప్రేక్షకులు ఆదరించ లేకపోయారు.
ఈ విధంగా పలు సినిమాలలో నటించిన సిద్ధార్థ్ విజయాన్ని అందుకోలేక పోయారు.ఈ క్రమంలోనే సిద్ధార్థ్ ఎస్కేప్ లైవ్ అనే హిందీ వెబ్‌సిరీస్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సిరీస్ డిస్నీ+హాట్ స్టార్ లో మే 20 వ తేదీ విడుదల కానుంది.ఈ క్రమంలోనే ఈ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు.
ఈ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సిద్ధార్థ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సిరీస్ గురించి సిద్ధార్థ్ మాట్లాడుతూ… ఇందులో నాది రెగ్యులర్ పాత్ర కాదు.ఈ విధమైనటువంటి విభిన్న పాత్ర కోసం నన్ను సంప్రదించి నన్ను ఎంపిక చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ విధమైనటువంటి మంచి ఆఫర్లు వస్తే తిరిగి బాలీవుడ్ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇస్తానని సిద్ధార్థ్ వెల్లడించారు.
నాకు ఎంతో వైవిధ్యమైన పాత్రలు వచ్చే వరకు తాను నటిస్తూనే ఉంటానని, ఎప్పుడైతే అలాంటి పాత్రలు రావో ఆ సమయంలో తాను యాక్టింగ్ మానేసి వేరే ఉద్యోగం చేస్తానని సిద్ధార్థ్ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేశారు.ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.